Site icon HashtagU Telugu

Mahadev App Case: మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో చర్యలు.. 16 ప్ర‌దేశాల్లో ఈడీ సోదాలు

Actions In Mahadev Betting

Actions In Mahadev Betting

 

 

ED Searches : మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసు(mahadev app case) విచారణలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. ఇందులో భాగంగా ఢిల్లీ ఎన్సీఆర్, ముంబయి, పశ్చిమబెంగాల్లోని సుమారు 16 ప్రాంతాల్లో బుధవారం తనిఖీలు చేపట్టింది. యాప్కు చెందిన ప్రధాన సూత్రధారులు సౌరభ్ చంద్రకర్, రవి ఉప్పల్ల సన్నిహితుడు నితీశ్ దివానన్ను ఈడీ అరెస్టు చేసిన 11రోజుల తర్వాత దాడులు జరగడం గమనార్హం. ఈ కేసులో ఈడీ ఇప్పటివరకు 9 మందిని అరెస్టు చేసింది. గతంలో ఇంటర్ పోల్ ఆదేశాల మేరకు చంద్రకర్, రవిలను దుబాయ్ లో అదుపులోకి తీసుకున్నారు.

వారిని భారత్ కి తీసుకురావడానికి ఈడీ ప్రయత్నిస్తోంది. యాప్ ద్వారా వచ్చిన అక్రమ నిధులను ఛత్తీస్ ఘడ్ లోని రాజకీయ నాయకులు, అధికారులకు లంచాలు చెల్లించడానికి ఉపయోగించినట్టు ఈడీ ఆరోపించింది. అంతే కాకుండా యూఏఈలోని రస్ అల్ ఖైమాలో 2023లో చంద్రకర్ వివాహం జరిగిందని, ఈ ఈవెంట్ కోసం సుమారు రూూ.200 కోట్లు ఖర్చు చేసినట్టు ఈడీ చార్జిషీట్లో పేర్కొంది. వీరిద్దరితో పాటు అనేక మందిపై ఈడీ రెండు చార్జిషీట్లు దాఖలు చేసింది. ఈ కేసులో మొత్తంగా రూ.6000కోట్ల మనీలాండరింగ్ జరిగినట్టు ఈడీ అంచనా వేస్తోంది. కాగా, ఈ యాప్ ప్రమోటర్లు ఛత్తీస్ ఘడ్ మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ కి సుమారు రూ.508 కోట్లు చెల్లించారని ఈడీ గతంలో ఆరోపించగా.. వీటిని ఆయన తోసిపుచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, ఈడీ ఈ కేసులో తొమ్మిదో నిందితుడిని అరెస్ట్ చేసిన రెండు వారాల అనంత‌రం తాజా సోదాలు జ‌రిగాయి. మ‌హ‌దేవ్ యాప్ ప్ర‌మోట‌ర్లు సౌర‌వ్ చంద్రార్క‌ర్‌, ర‌వి ఉప్ప‌ల్‌కు స‌న్నిహితుడిగా పేరొందిన నితీష్ దివాన్‌ను ఫిబ్ర‌వ‌రి 15న అరెస్ట్ చేశారు.

read also :