కేంద్ర ఎన్నికల సంఘం (EC) దేశ రాజకీయ వ్యవస్థలో పటిష్టతను తీసుకురావడం కోసం కీలక చర్యలు తీసుకుంది. దేశవ్యాప్తంగా గుర్తింపు లేని, ఎన్నడూ ఎన్నికల్లో పోటీ చేయని అనేక పార్టీలు (Party) నామమాత్రంగా కేవలం పేరుకే నమోదై ఉన్నాయని గుర్తించిన ఈసీ, వాటిపై చర్యలకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు 345 రాజకీయ పార్టీలను డీ లిస్ట్ చేసేందుకు ప్రక్రియను ప్రారంభించింది. 2019 తర్వాత ఒక్క ఎన్నికల్లోనూ పాల్గొనని రాజకీయ పార్టీలు ఈ జాబితాలో ఉన్నాయి.
Shubhanshu Shukla: తల కొంచెం బరువుగా ఉంది.. ISSలో శుభాంశు శుక్లా తొలి స్పందన ఇదే!
సాధారణంగా ఒక రాజకీయ పార్టీకి గుర్తింపు రావాలంటే, ఆ పార్టీ జరగనున్న సాధారణ ఎన్నికల్లో కనీసం 6 శాతం ఓట్లను పొందాలి. కానీ ఇటువంటి ప్రమాణాలు నెరవేర్చని పార్టీలపై చర్యలు తీసుకోవాలన్నది ఎన్నికల సంఘం ఆలోచన. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో నామమాత్రంగా పార్టీగా నమోదు చేసుకుని, ఎటువంటి రాజకీయ కార్యకలాపాలు లేకుండా కొనసాగుతున్న పార్టీలు ఎన్నికల వ్యవస్థను మలినపరుస్తున్నాయనే అభిప్రాయంతో ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ చర్యల ద్వారా ఎన్నికల ప్రక్రియను మరింత పారదర్శకంగా మార్చాలని ఈసీ లక్ష్యంగా పెట్టుకుంది. కేవలం పన్ను మినహాయింపులు, డొనేషన్ల పేరిట లబ్ధి పొందే పార్టీలకు అడ్డుకట్ట వేసేందుకు కూడా ఈ చర్యలు ఉపయోగపడనున్నాయి. దీని వల్ల ప్రజలలో నమ్మకాన్ని పెంపొందించడంతో పాటు, దేశ రాజకీయ వ్యవస్థకు ఒక శ్రమతరమైన శుద్ధి ప్రక్రియగా ఇది నిలవనుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.