Congress: కాంగ్రెస్ ఇలాంటి వ్యాఖ్య‌లే..ఆ పార్టీ ప‌త‌నానికి కార‌ణ‌ం: స‌త్యేంద్ర దాస్

  Acharya Satyendra Das : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) చేసిన శ‌క్తి వ్యాఖ్య‌ల‌(Shakti comments)పై శ్రీ రామ జ‌న్మ‌భూమి ఆల‌య ప్ర‌ధాన పూజారి ఆచార్య స‌త్యేంద్ర దాస్(Acharya Satyendra Das) అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. రాహుల్ వ్యాఖ్య‌ల‌ను స‌త్యేంద్ర దాస్ ఖండించారు. కాంగ్రెస్ నేత‌లు ఇలాంటి వ్యాఖ్య‌లు చేస్తుండ‌ట‌మే ఆ పార్టీ ప‌త‌నానికి కార‌ణ‌మ‌ని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ హిందూ వ్య‌తిరేక పార్టీ కావ‌డంతోనే ఇలాంటి వ్యాఖ్య‌లు ఆ పార్టీ నేత‌లు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. […]

Published By: HashtagU Telugu Desk
Acharya Satyendra Das React

Acharya Satyendra Das React

 

Acharya Satyendra Das : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) చేసిన శ‌క్తి వ్యాఖ్య‌ల‌(Shakti comments)పై శ్రీ రామ జ‌న్మ‌భూమి ఆల‌య ప్ర‌ధాన పూజారి ఆచార్య స‌త్యేంద్ర దాస్(Acharya Satyendra Das) అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. రాహుల్ వ్యాఖ్య‌ల‌ను స‌త్యేంద్ర దాస్ ఖండించారు. కాంగ్రెస్ నేత‌లు ఇలాంటి వ్యాఖ్య‌లు చేస్తుండ‌ట‌మే ఆ పార్టీ ప‌త‌నానికి కార‌ణ‌మ‌ని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ హిందూ వ్య‌తిరేక పార్టీ కావ‌డంతోనే ఇలాంటి వ్యాఖ్య‌లు ఆ పార్టీ నేత‌లు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు.

We’re now on WhatsApp. Click to Join.

భార‌త్ హిందువుల మెజారిటీ దేశ‌మ‌ని, మీరు ఇలాంటి వ్యాఖ్య‌లు చేస్తుంటే మీతో ఎవ‌రు క‌లిసి వ‌స్తార‌ని ప్ర‌శ్నించారు. హిందూ ధ‌ర్మం, స‌నాత‌న ధ‌ర్మంలో నారీ శ‌క్తి గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని స‌త్యేంద్ర దాస్ చెప్పుకొచ్చారు. మ‌న దేవీ, దేవ‌త‌ల‌కు వ్య‌తిరేకంగా మాట్లాడేవారిని జైలుకు పంపాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

read also: Chiranjeevi: నెట్టింట వైరల్ అవుతున్న మెగాస్టార్ టెన్త్ క్లాస్ సర్టిఫికెట్?

కాగా, భార‌త్ జోడో న్యాయ్ యాత్ర ముగింపు సంద‌ర్భంగా ఆదివారం రాహుల్ మాట్లాడుతూ హిందూమ‌తంలో శ‌క్తి అన్న ప‌దం ఉన్న‌ద‌ని, ఆ శ‌క్తితో తాము పోరాడుతున్నామ‌ని, ఆ శ‌క్తి ఏంట‌న్న‌దే ప్ర‌శ్న అని, ఓ రాజు ఆత్మ ఈవీఎంలో ఉన్న‌ద‌ని, ఇది నిజం అని, ఈడీ, సీబీఐ, ఆదాయ ప‌న్నుశాఖ లాంటి సంస్థ‌ల‌పైనే ఆ రాజు ఆత్మ ఉంద‌ని రాహుల్ విమ‌ర్శించారు.

  Last Updated: 18 Mar 2024, 02:39 PM IST