Rajiv Gandhi Assassination Convicts : జైలు నుంచి విడుదలైన రాజీవ్ గాంధీ హత్య కేసు నిందితులు..!!

  • Written By:
  • Publish Date - November 12, 2022 / 09:01 PM IST

భారతదేశ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న నిందితులు రిలీజ్ అయ్యారు. నళిని, ఆమె భర్త మురుగన్ సహా మిగిలిన దోషులు తమిళనాడు జైలు నుంచి రిలీజ్ అయ్యారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో వీరిని అధికారులు విడుదల చేశారు. పెరోలో పై ఉన్న నళిని శిక్ష అనుభవించిన వెల్లూరులోని ప్రత్యేక మహిళ జైలుకు వెళ్లి ఆమె విడుదలకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేశారు. జైలు నుంచి విడుదలయ్యాక తన భర్త మురుగన్ ను చూసి ఆమె భావోద్వేగానికి లోనయ్యారు.

1991లో మాజీ ప్రధానిరాజీవ్ గాంధీ హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్ష పడిన ఏజీ పెరారివాలన్‌ను విడుదల చేయాలని మేలో సుప్రీంకోర్టు ఆదేశించింది. శుక్రవారం జస్టిస్ బి.ఆర్. ఎస్ నళిని ఆమె భర్తతో సహా దోషులందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ గవాయ్, బివి నాగరత్న ఉత్తర్వులు జారీ చేశారు. దోషులందరినీ విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిందని, అలాగే దోషులు రెండు దశాబ్దాలకు పైగా జైలు జీవితం గడిపారని, వారి ప్రవర్తన సంతృప్తికరంగా ఉందని పేర్కొంది. శనివారం జైలు నుంచి విడుదలైన వారిలో శాంతన్, రాబర్ట్ పాయస్, జయకుమార్, రవిచంద్రన్ ఉన్నారు.

నళిని, రవిచంద్రన్ తమిళనాడుకు చెందిన వారు కాగా మరో నలుగురు శ్రీలంక జాతీయులు. శ్రీలంక స్థానికులు – శాంతన్, మురుగన్, రాబర్ట్ పయస్, జయకుమార్‌లను శ్రీలంక శరణార్థుల కోసం తిరుచ్చి పునరావాస శిబిరానికి తరలించారు. ఆరుగురు దోషులు గత మూడు దశాబ్దాలుగా జైలులో ఉన్నారని, వారు జైలులో ఎలాంటి ఇబ్బందులు సృష్టించలేదని, అంటే వారి ప్రవర్తన సంతృప్తికరంగా ఉందని సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. నళిని తరఫు న్యాయవాది పుగజెండి మీడియాతో మాట్లాడుతూ.. నళిని తమిళనాడులోనే ఉండాలా లేక తన కూతురు ఉంటున్న లండన్‌కు మారాలా అనేది ఇంకా నిర్ణయించలేదని చెప్పారు.