Site icon HashtagU Telugu

Haryana : హర్యానాలో 15 వాహ‌నాలు ఢీ.. అంబాలా-యమునానగర్-సహారన్‌పూర్ హైవేపై ఘ‌ట‌న‌

Accidents Imresizer

Accidents Imresizer

హర్యానాలోని అంబాలా-యమునానగర్-సహారన్‌పూర్ హైవేపై దట్టమైన పొగమంచు కారణంగా 15 వాహ‌నాలు ఢీకొట్టుకున్నాయి. ఈ ఘ‌ట‌న‌లో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. హైవేపై 10 నుంచి 15 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నట్లు తమకు సమాచారం అందిందని ట్రాఫిక్ పోలీసు అధికారి లోకేష్ రాణా తెలిపారు. పోలీసు బృందాలు ఘటనాస్థలికి చేరుకుని ట్రాఫిక్‌ను ప్రత్యామ్నాయ మార్గంలో మళ్లించారు. పోలీసు బృందాలు వాహనాల్లో చిక్కుకున్న వారిని రక్షించడంతో పాటు దెబ్బతిన్న వాహనాలను కూడా క్రేన్ల సహాయంతో ప‌క్క‌కి తీశారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారంతా ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.

వాహనాలు ఒకదానికొకటి ఢీకని రోడ్డు బ్లాక్ అవ్వ‌డంతో హైవేకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న పోలీసులు, ట్రాఫిక్ సిబ్బంది ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. దట్టమైన పొగమంచు యమునా నగర్‌ను చుట్టుముట్టడం ఇది రెండవ రోజని పోలీసులు తెలిపారు. పొగమంచు మధ్య డ్రైవింగ్ చేస్తున్నప్పుడు తమ వాహనంలోని డిప్పర్లు, ఫాగ్ లైట్లను ఆన్ చేయాలని డ్రైవర్లకు పోలీస్ అధికారి లోకేష్ రాణా విజ్ఞప్తి చేశారు.

Exit mobile version