Site icon HashtagU Telugu

Ranveer Singh Nudity: రణ్‌వీర్‌ ఫోటోషూట్‌పై విమర్శల వెల్లువ

Ranveer1

Ranveer1

ఇప్పటి వరకూ హీరోయిన్ల అశ్లీల ఫోటోషూట్స్‌ , వారు వేసుకునే దుస్తుల గురించే హాట్‌ హాట్‌గా చర్చ జరిగేది. ఇప్పుడు హీరోయిన్లకు ధీటుగా హీరోలు కూడా గ్లామర్ షోకు దిగుతున్నారు. అదేదో సిక్స్ ప్యాక్ అనుకుంటే పొరపాటే… మ్యాగ్‌జైన్ కోసం ఏకంగా న్యూడ్‌గా ఫోటో షూట్ చేసి సరికొత్త రచ్చకు తెరతీశాడు బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్‌సింగ్‌. పేపర్ అనే మ్యాగజైన్‌ కోసం రణ్‌వీర్ నగ్నంగా ఫోటోషూట్ చేశాడు. ఒంటిపై నూలుపోగు లేకుండా ఫోటోలకు ఫోజులివ్వగా… ఈ ఫోటోషూట్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది.

బాలీవుడ్‌లో రణ్‌వీర్‌సింగ్‌ను పలువురు సెలబ్రిటీలు పొగడ్తుంటే నెటిజన్లు, ప్రేక్షకులు మాత్రం చీల్చి చెండాడుతున్నారు. తాజాగా రణ్‌వీర్ సింగ్ న్యూడ్ ఫొటోషూట్‌పై సామాజిక కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రణ్‌వీర్ సింగ్‌ ఒక మానసిక రోగి అంటూ మండిపడుతున్నారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో పలు చోట్ల అతని ఫోటోషూట్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేశారు. నూలు పోగు కూడా లేకుండా ఉన్న రణ్‌వీర్ సింగ్‌ను చూసిన వారు దుస్తులు సేకరించి అతనికి పంపారు. సినిమా ప్రమోషన్ కోసం ఇలాంటి చీప్ పబ్లిసిటీ స్టంట్స్ చేస్తున్నాడని మరికొందరు విమర్శిస్తున్నారు. ఇలాంటి పని సామాన్య వ్యక్తి చేసుంటే అంగీకరిస్తారా అని ప్రశ్నిస్తున్నారు.

చూస్తుంటే ఈ వివాదం ఇంకా కొనసాగేలా ఉందని తెలుస్తోంది. డబ్బుల కోసం మరీ ఇంతలా దిగజారాలా అంటూ కొందరు తప్పుపడుతుంటే… మరికొందరు మాత్రం మద్ధతుగా నిలుస్తున్నారు. ఇలాంటి ఫోటోషూట్ చేసేందుకు చాలా గట్స్ ఉండాలని అభిప్రాయపడుతున్నారు. అయితే స్ఫూర్తివంతంగా ఉండాల్సిన వ్యక్తి ఇలా వ్యవహరించడం ఎంతవరకూ కరెక్ట్ అనే చర్చ కూడా జరుగుతోంది. తనపై వస్తున్న విమర్శలకు సంబంధించి ఇప్పటి వరకూ రణ్‌వీర్‌ స్పందించలేదు.