Gujarat Assembly Elections : ఆ నియోజ‌క‌వ‌ర్గం నుంచే పోటీ చేస్తున్న గుజ‌రాత్ ఆప్ సీఎం అభ్య‌ర్థి..!

గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం అభ్య‌ర్థి ఇసుదాన్ గాధ్వీ నియోజ‌క‌వ‌ర్గాన్ని పార్టీ ప్ర‌క‌టించింది. ఖంభాలియా...

  • Written By:
  • Updated On - November 14, 2022 / 11:35 AM IST

గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం అభ్య‌ర్థి ఇసుదాన్ గాధ్వీ నియోజ‌క‌వ‌ర్గాన్ని పార్టీ ప్ర‌క‌టించింది. ఖంభాలియా నియోజకవర్గం నుంచి గాధ్వి పోటీ చేయనున్నారు. ఇప్పటివరకు ఆప్ 176 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఈ విషయాన్ని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ ద్వారా వెల్లడించారు. రైతులు, నిరుద్యోగ యువకులు, మహిళలు, వ్యాపారవేత్తల కోసం ఏళ్ల తరబడి తన గొంతుకను వినిపించిన ఇసుదాన్ గాధ్వి, జామ్ ఖంభాలియా నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తారని ఆయ‌న పేర్కొన్నారు. కేజ్రీవాల్ ట్వీట్‌పై గాధ్వి స్పందిస్తూ.. తాను గుజరాత్ ప్రజలకు సేవ చేస్తానని హామీ ఇస్తానని చెప్పారు.

గత వారం 2022 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు గాధ్విని ఆప్‌ ముఖ్యమంత్రి అభ్యర్థిగా అధిష్టానం ప్ర‌క‌టించింది.  గాధ్వి ఆప్‌ జాతీయ జాయింట్ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. గుజరాత్‌లో ముఖ్యమంత్రిని ఎంపిక చేసేందుకు కేజ్రీవాల్ నేతృత్వంలోని పార్టీ నిర్వహించిన సర్వేలో ఆయనకు 73% పైగా ఓట్లు వచ్చాయి. డిసెంబర్ 1, 5 తేదీల్లో గుజరాత్‌లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌తో పాటు డిసెంబర్ 8న ఫలితాలు వెల్లడికానున్నాయి. 2022 గుజరాత్ ఎన్నికల్లో అధికార బీజేపీ, కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ ఉంటుంది. ఆప్ కూడా రెండు పార్టీల ఓట్ల శాతాన్ని దెబ్బతీయాలని చూస్తోంది. ముఖ్యంగా 1998 నుంచి బీజేపీ రాష్ట్రాన్ని పాలిస్తోంది. 2017 ఎన్నికల్లో మొత్తం 182 స్థానాలకు గాను 99 స్థానాల్లో బీజేపీ గెలుపొందగా, కాంగ్రెస్ 77 స్థానాల్లో విజయం సాధించింది.