Site icon HashtagU Telugu

Gujarat : కేబుల్ బ్రిడ్జి కూలినప్పుడు.. బర్త్ డే సెలబ్రేషన్స్ లో బిజీగా ఉన్న గుజరాత్ ఆరోగ్యశాఖమంత్రి..!

Health Minister

Health Minister

గుజరాత్ లో విషాద ఘటన జరిగిన సంగతి తెలిసిందే. కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనలో 140పైగా మంది మరణించారు. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తోపాటు దేశంలోని సామాన్యుల దగ్గరి నుంచి నాయకుల వరకు ప్రతిఒక్కరూ విచారం వ్యక్తం చేశారు. ఈ సంఘటన ఎంతో దిగ్భ్రాంతిని కలిగించింది. అయితే కేబుల్ బ్రిడ్జి కూలిన సమయంలో గుజరాత్ ఆరోగ్యశాఖమంత్రి హృషికేశ్ పుట్టిన రోజు వేడుకల్లో బిజీగా ఉన్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: 10వ తరగతి విద్యార్థినిపై గ్యాంగ్ రేప్…అపస్మారకస్థితిలో రోడ్డపై బాలిక..!!

ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే నరేష్ బల్యాన్ సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో గుజరాత్ ఆరోగ్యశాఖమంత్రి తన పుట్టినరోజును తన ఆత్మీయులు కార్యకర్తల జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా బాణాసంచా కాల్చారు. నరేష్ బాల్యాన్ ట్వీట్ చేస్తూ…ఆదివారం సాయంత్రం మోర్జీలో ఇంత పెద్ద ఘటన జరిగింది. 140మందికిపై మరణించారు. పిల్లలు, మహిళలు ఎక్కువగా ఉన్నారు. అయితే గుజరాత్ ఆరోగ్యశాఖ మంత్రి ఘటన గురించి తెలిసినప్పటికీ బాణా సంచా పేలుస్తూ పుట్టిన రోజు ను ఘనంగా జరుపుకున్నారు. వారికి అహంకారం ఎక్కువగా ఉంది. వారు ఓడేంతవరకు వారి గర్వం విచ్చిన్నం కాదు అంటూ ట్వీట్ చేశారు.

చారిత్రాత్మకమైన కేబుల్ బ్రిడ్జి ఆదివారం సాయంత్రం కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 140మందికి పైగా మరణించారు. మరణించివారిలో పిల్లలు, మహిళలు ఎక్కువగా ఉన్నారు. ఇంకా ఆ ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.