ACB Raids : ఢిల్లీలో ఏసీబీ సోదాలు.. ఆప్ ఎమ్మెల్యే అరెస్ట్‌

అక్రమాస్తుల కేసులో ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌ను ఢిల్లీ ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.

Published By: HashtagU Telugu Desk
Aap Mla Amanatullah Khan Imresizer

Aap Mla Amanatullah Khan Imresizer

అక్రమాస్తుల కేసులో ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌ను ఢిల్లీ ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. అమాన‌తుల్లా ఖాన్ చైర్మన్‌గా ఉన్న ఢిల్లీ వక్ఫ్ బోర్డులో జరిగిన రిక్రూట్‌మెంట్‌లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఏసీబీ విచారణ జరుపుతోంది. ఏసీబీ అధికారులు ఎమ్మెల్యే ఖాన్‌ ఇల్లు, అతనికి సంబంధించిన ఇతర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి రూ. 24 లక్షలతో పాటు రెండు అనుమతి లేని ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. 2020లో నమోదైన అవినీతి నిరోధక చట్టం కేసుకు సంబంధించి ప్రశ్నించేందుకు ఏసీబీ గురువారం ఖాన్‌కు నోటీసులు జారీ చేసింది. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు ఎమ్మెల్యే అమాన‌తుల్లా ఖాన్‌ను విచారణకు పిలిచారు.

ఢిల్లీ వక్ఫ్ బోర్డు ఛైర్మన్ ఖాన్ .. కొత్త వక్ఫ్ బోర్డు కార్యాలయాన్ని నిర్మించినందున తనకు సమన్లు ​​అందాయని పేర్కొంటూ నోటీసుపై ట్వీట్ చేశారు. గతంలో ఖాన్‌కు వ్యతిరేకంగా ఒక కేసులో సాక్షులను బెదిరించ‌డం ద్వారా విచారణకు ఆటంకం కలిగించినందుకు ఢిల్లీ వక్ఫ్ బోర్డు ఛైర్మన్‌గా ఖాన్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఏసీబీ అధికారులు లెఫ్టినెంట్ గవర్నర్ సెక్రటేరియట్‌కు లేఖ రాశారు.

  Last Updated: 17 Sep 2022, 07:19 AM IST