Site icon HashtagU Telugu

Delhi Politics : ఆప్ మంత్రి రాజేంద్ర పాల్ గౌతమ్ రాజీనామా…గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో నిర్ణయం..?

Goutham

Goutham

ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన సామాజిక సంక్షేమ శాఖ మంత్రి రాజేంద్ర పాల్ గౌతమ్ రాజీనామా చేశారు. శుక్రవారం నాడు రాజేంద్ర పాల్ గౌతమ్ ఓ బౌద్దుల కార్యక్రమంలో పాల్గొన్నారు. సుమారు 7వేల మంది బౌద్ద మతాన్ని స్వీకరించారు. ఆ కార్యక్రమంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 1956లో సూచించిన సూత్రాలను చదివారు. హిందూదేవుళ్లను విశ్వసించమని పూజించనని పేర్కొంటూ ప్రసంగం సాగింది. ఇందులో ఢిల్లీ మంత్రి రాజేంద్రపాల్ కూడా ఉన్నారు. తాను కూడా హిందూ దేవుళ్లను పూజించనని అనడం వీడియోలో స్పష్టంగా వినిపించింది.

దీనిపై బీజేపీ తీవ్ర అభ్యంతరం తెలిపింది. రాజేంద్ర పాల్ గౌతమ్ కు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టింది. ఈ ఆందోళనలు కేవలం మంత్రి వరకే పరిమితం కాలేదు. ఆప్ చీప్ ఢిల్లీ ముఖ్యమంత్రి గుజరాత్ అసెంబ్లీ ఎలక్షన్స్ కోసం ప్రచారం చేయిస్తున్న కేజ్రీవాల్ కు తగిలింది. ఎన్నికల కోసమే హిందూ ఆలయాలు తిరుగుతారని వాస్తవంలో వాళ్లు హిందూ వ్యతిరేకులంటూ బీజేపీ విమర్శించింది. ఈ ఆరోపణలను కేజ్రీవాల్ ఎదుర్కోవల్సి వచ్చింది. సదురు మంత్రిని తొలగించాలని కేజ్రీవాల్ పై ఒత్తిడి పెరిగింది. బీజేపీ నేతలు బహిరంగంగా డిమాండ్ చేశారు. ఈ తరుణంలోనే ఆప్ మంత్రి తన నిర్ణయాన్ని ప్రకటించారు.

Exit mobile version