Minister Saurabh Bhardwaj : లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఢిల్లీలోని రిడ్జ్ ప్రాంతంలో 1100 చెట్లు నరికివేతకు అనుమతులు ఇవ్వడంపై ఆప్ మంత్రి సౌరభ్ భరద్వాజ్ స్పందించారు. చెట్ల నరికివేత సరికాదన, దీనికి పరిష్మన్ ఇచ్చినందుకు గాను సక్సేనా తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ‘చెట్లను నరికిన కంపెనీ దాఖలు చేసిన అపిడవిట్‌లో వాస్తవాలు బయటపడుతున్నాయి. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఎల్‌జీ ఫిబ్రవరి 3న సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రహదారిని సందర్శించి, ROW (రైట్ ఆఫ్ వే)లో చెట్లను తొలగించాలని ఆదేశించినట్లుగా ఉంది. ఎల్‌జీ అక్కడికి వెళ్లారని, రోడ్డు మార్గంలో ఉన్న చెట్లన్నింటినీ నరికి వేయాలని ఆదేశించినట్లు డీడీఏ నుంచి వచ్చిన ఈ-మెయిల్‌లో స్పష్టంగా ఉంది. ఇంతకన్నా పెద్ద ఆధారం ఇంకేం కావాలి? ఢిల్లీలో ఎల్‌జీ, బీజేపీ వ్యవహారం ఢిల్లీ ప్రజల ముందు బయటపడింది. అందువల్ల ఎల్‌జీ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలి” అని డిమాండ్ చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
‘ఈ అంశంపై బహిరంగ చర్చకు ఎల్‌జీ సిద్ధమేనా? ఎల్‌జీ సర్‌ని ఆహ్వానిస్తున్నా. స్థలం, సమయం, తేదీ మీరే చెప్పండి. నేను మీడియా ముందు సవాల్ చేస్తున్నా. మీరు వచ్చి డిబేట్ చేయండి. అంతేగానీ ఎల్జీ హౌస్ గోడల వెనక దాక్కోవద్దు. ఢిల్లీ ప్రజలతో పాటు ఎన్నికైన ప్రభుత్వం, మంత్రి ప్రశ్నలు అడుగుతున్నారు” అని మంత్రి సౌరభ్ అన్నారు.
మరోవైపు, ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ సైతం ఈ అంశంపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు డిమాండ్ చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్‌తో సహా బాధ్యులందరిపై చర్య తీసుకునేలా అన్ని వాస్తవాలను సుప్రీంకోర్టు ముందు ఉంచాలన్నారు. సక్సేనా బిలియనీర్ల వైపు ఉన్నారని.. పర్యావరణం, ఢిల్లీ ప్రజల గురించి ఆయనకు ఎలాంటి ఆందోళన లేదన్నారు. ఈ వ్యవహారంలో ఎల్‌జీతో పాటు బాధ్యులందరిపైనా చర్యలు తీసుకోవాలన్నారు. కాగా, దీనిపై ఎల్‌జీ కార్యాలయం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదు.