Site icon HashtagU Telugu

Delhi Assembly Elections : ఎన్నికల ప్రచార గీతాన్ని విడుదల చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ

Aam Aadmi Party released election campaign song

Aam Aadmi Party released election campaign song

Delhi Assembly Elections : ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలోనే కేజ్రీవాల్‌ను మరోసారి అదికారంలోకి తీసుకురావాలంటూ ఎన్నికల ప్రచార గీతాన్ని తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ విడుదల చేసింది. ”ఫిర్ లాయేంగే కేజ్రీవాల్” అనే టైటిల్‌, 3.38 నిమిషాల నిడివితో ఈ సాంగ్‌ ఉంది. ‘ఆప్’ ప్రభుత్వ హయాంలో సాధించిన విజయాలును హైలైట్ చేస్తూ ఈ సాంగ్ రూపొందింది.

ఇక, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల కమిషన్ ప్రకటించడంపై మాజీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ మాట్లాడుతూ..ఢిల్లీ ఎన్నికల తేదీ వచ్చేసింది. కార్యకర్తలంతా రెట్టించిన ఉత్సాహం, పూర్తి సామర్థ్యంలో రంగంలోకి దిగండి. కార్యకర్తలే పార్టీకి అతిపెద్ద బలం అని అన్నారు. ఈ ఎన్నికల్లో ఆప్ గెలుపు తథ్యమని చెప్పారు. ఈ ఎన్నికలు పనిచేసి ఓట్లడిగే రాజకీయాలపై ఆప్‌కు విశ్వాసం ఉంది. మనం తప్పనిసరిగా గెలుస్తాం అని కేజ్రీవాల్ ఒక ట్వీట్‌లో కార్యకర్తలను ఉత్సాహపరిచారు. ఈ ఎన్నికలు పని చేసి ఓట్లడిగే రాజకీయాలకు, కేవలం విమర్శలతో ఓట్లడిగే రాజకీయాలకు మధ్య జరుగుతున్న పోరాటం అన్నారు.

ఎన్నికల ప్రచార సాంగ్ విడుదల కార్యక్రమంలో ముఖ్యమంత్రి అతిషి, పార్టీ సీనియర్ నేతలు మనీష్ సిసోడియా, సౌరభ్ భరద్వాజ్, గోపాల్ రాయ్, సంజయ్ సింగ్ తదిరులు హాజరయ్యారు. ఢిల్లీ ప్రజల కోసం చేపట్టిన అనేక సంక్షేమ పథకాలను ఈ ప్రచారగీతంలో ఆప్ నేతలు వివరించారు. తమ పార్టీ గీతాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని ప్రజలను కోరారు. ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుండగా, ఫిబ్రవరి 8న ఫలితాలు వెలువడతాయి.

Read Also: Special Buses : సంక్రాంతికి స్పెషల్ బస్సులు నడపనున్న ఏపీఎస్ఆర్టీసీ