Aadhaar Card: ఫైనాన్షియల్ అడ్రస్ గా ‘ఆధార్ కార్డు’

సామాన్యులకు ఆధార్ నెంబర్ ఇప్పుడు ఆర్థిక చిరునామాగా మారిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) పేర్కొన్నారు.

సామాన్యులకు ఆధార్ నెంబర్ ఇప్పుడు ఆర్థిక చిరునామాగా మారిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. మంగళవారం పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన ఆర్థిక సర్వేలో ఆధార్ కార్డు (Aadhaar Card) ప్రాముఖ్యాన్ని మంత్రి వివరించారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఈ ఆధార్ కార్డే ఆధారమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.

సంక్షేమ పథకాల అమలులో భాగంగా లబ్దిదారుల ఖాతాల్లోకి డబ్బు జమచేయడానికి ప్రభుత్వాలు ఆధార్ నెంబర్ ను ప్రాతిపదికగా తీసుకుంటున్నాయని మంత్రి వివరించారు. ఈ నెంబర్ ఆధారంగానే లబ్దిదారుల ఖాతాల్లో నేరుగా డబ్బు జమ అవుతోందని చెప్పారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేసే రేషన్ కు ఆధార్ కీలకమని చెప్పారు. వన్ నేషన్ వన్ రేషన్ కార్డు స్కీముకు కూడా ఆధార్ కీలకంగా మారిందన్నారు.

కరోనా కాలంలో చేపట్టిన వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఆధార్ కార్డు (Aadhaar Card) ద్వారా అందరికీ టీకాలు వేసిన విషయాన్ని కేంద్ర మంత్రి గుర్తుచేశారు. వ్యాక్సినేషన్ లో పారదర్శకతకు ఆధార్ కార్డు దోహదపడిందని చెప్పారు. కేంద్రం అమలు చేస్తున్న 318 సంక్షేమ పథకాలు, రాష్ట్రాలు అమలు చేస్తున్న 720 పథకాలకు ఆధార్ కార్డును ప్రాతిపదికగా తీసుకున్నట్లు మంత్రి నిర్మలా సీతారామన్.

Also Read:  Bhishma Ekadashi: ఫిబ్రవరి 1 భీష్మ ఏకాదశి, ఈ రోజు ఇలా చేస్తే ఐశ్వర్యం, ఆరోగ్యం, విజయం