YouTube: కామెడీ వీడియోలు పెట్టి.. రూ.50లక్షల కార్ కొన్న యువకుడు.. వైరల్!

ఒకప్పుడు డబ్బులు సంపాదించాలంటే ఒళ్లు వంచి పని చేయాల్సి వచ్చేది. ఎండావానలు తేడా లేకుండా కష్టపడితే కానీ డబ్బు చేతికి అందేది కాదు.

  • Written By:
  • Publish Date - January 19, 2023 / 07:54 PM IST

YouTube: ఒకప్పుడు డబ్బులు సంపాదించాలంటే ఒళ్లు వంచి పని చేయాల్సి వచ్చేది. ఎండావానలు తేడా లేకుండా కష్టపడితే కానీ డబ్బు చేతికి అందేది కాదు. కానీ ఇప్పుడు కాలం మారింది. టెక్నాలజీ మనుషుల జీవితాలను మార్చేసింది. అదే సమయంలో సంపాదించే పద్ధతిని కూడా మార్చేసింది. చాలామంది యువతీ, యువకులు.. యూట్యూబ్ లో వీడియోలు అప్ లోడ్ చేస్తూ నెలకు లక్షల్లో సంపాదిస్తున్నారు. తాజాగా బిహార్ కు చెందిన ఓ యూట్యూబర్ సంచలనంగా మారాడు.

బిహార్ కు చెందిన ఓ యూట్యూబర్ తనదైన కామెడీ వీడియోలను యూట్యూబ్ లో పోస్ట్ చేస్తూ.. రూ.50లక్షల విలువైన ఆడీ కార్ ని కొనుగోలు చేశాడు. వీడియో ద్వారా వచ్చిన సంపాదనతో అతడు ఏకంగా రూ.50లక్షల విలువైన కారును కొనడం సెన్సేషన్ గా మారింది. రిపోర్టింగ్ ను కామెడీతో మిక్స్ చేసి.. తన వీడియోల ద్వారా అందరినీ ఎంటర్టైన్ చేస్తున్న ఆ యువకుడు.. కొత్తగా కొన్న తన ఆడీ కార్ ను పశువుల కొట్టం పక్కన పార్క్ చేయడం మరో విశేషం.

బిహార్ రాష్ట్రంలోని జౌరంగాబాద్ లోని జసోయా ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల హర్ష్ రాజ్ పుత్ కు వీడియోలు చేయాలనే కోరికతో.. యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాడు. స్థానిక సమస్యల మీద వ్యంగ్యంగా తనదైన స్టైల్ లో రిపోర్టింగ్ చేసే హర్ష్ రాజ్ పుత్.. ‘ధాకడ్’ అనే న్యూస్ రిపోర్టర్ పేరుతో రకరకాల సమస్యలపై కామెడీ వీడియోలు చేసి, వాటిని యూట్యూబ్ లో అప్ లోడ్ చేస్తుంటారు. అలా ఆ వీడియోలు బాగా పాపులర్ కాగా.. యూట్యూబ్ ద్వారా బాగా సంపాదించాడు.

హర్ష్ రాజ్ పుత్ తన ఛానల్ ‘ధాకడ్’ ఎంతో పాపులర్ అయ్యాడు. అంతకంతకు అతడి వీడియోలకు వ్యూస్ పెరగగా.. అతడు నెలకు రూ.8లక్షల వరకు సంపాదించడం మొదలుపెట్టాడు. ఇలా నెలకు తనకు వచ్చిన ఆదాయాన్ని పొదుపు చేసిన హర్ష్.. ఏకంగా రూ.50లక్షల విలువ చేసే ఆడీ కార్ ను కొనడానికి వినియోగించాడు. 33లక్షల మంది సబ్ స్క్రైబర్లను కలిగి ఉన్న హర్ష్ రాజ్ పుత్.. ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాడు.