Shaliza Dhami: తొలిసారిగా మహిళా శాలిజా ధామి కవాతుకు నాయకత్వం

భారత వైమానిక దళ దినోత్సవం 91వ వార్షికోత్సవం సందర్భంగా, ప్రయాగ్‌రాజ్‌లోని బమ్రౌలీలోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో మహిళా ఆఫీసర్ గ్రూప్ కెప్టెన్ శాలిజా ధామి కవాతుకు నాయకత్వం వహించారు.

Shaliza Dhami:: భారత వైమానిక దళ దినోత్సవం 91వ వార్షికోత్సవం సందర్భంగా, ప్రయాగ్‌రాజ్‌లోని బమ్రౌలీలోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో మహిళా ఆఫీసర్ గ్రూప్ కెప్టెన్ శాలిజా ధామి కవాతుకు నాయకత్వం వహించారు. భారత వైమానిక దళం 91వ వార్షికోత్సవం సందర్భంగా మహా ప్రదర్శన ప్రారంభం కాగానే ప్రాంగణం చప్పట్లతో ప్రతిధ్వనించింది. పరేత్ కవాతు సరిగ్గా 7:40కి ప్రారంభమైంది. కొంత సమయం తరువాత పారాట్రూపర్ల బృందం 8000 అడుగుల ఎత్తు నుండి గాలిలోకి దూకినప్పుడు, బమ్రౌలీ వద్ద ఉన్న సెంట్రల్ ఎయిర్ కమాండ్ కాంప్లెక్స్ కరతాళధ్వనులతో ప్రతిధ్వనించింది.

సెంట్రల్ ఎయిర్ కమాండ్‌లో నిర్వహించిన 91వ వైమానిక దళ దినోత్సవం సందర్భంగా కవాతు నిర్వహించే బాధ్యతను గ్రూప్ కెప్టెన్ శైలజా ధామికి అప్పగించారు. దాన్ని ఆమె చక్కగా ప్రదర్శించారు. ఈ కవాతులో మొత్తం 40 మంది మహిళలు పాల్గొన్నారు. వీరిలో 31 మంది మహిళలు అగ్ని వీర్ బృందం. పరేడ్‌లో మొత్తం 361 మంది వైమానిక యోధులు పాల్గొన్నారు.

హెలికాప్టర్ పైలట్ ధామీ మార్చిలో ఫ్రంట్‌లైన్ IAF పోరాట విభాగానికి నాయకత్వం వహించిన మొదటి మహిళగా చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం ఆమె పశ్చిమ సెక్టార్‌లో క్షిపణి స్క్వాడ్రన్‌కు కమాండ్‌గా ఉంది. ధామి 2003లో భారత వైమానిక దళంలోకి ప్రవేశించారు. ఆమె ఒక క్వాలిఫైడ్ ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్.

Also Read: Yes Bank: FDలపై వడ్డీ రేట్లను సవరించిన ఎస్ బ్యాంక్.. తాజా వడ్డీ రేట్లు ఇవే..!