BJP 6060 Crores : రూ.12వేల కోట్లలో రూ.6వేల కోట్లు బీజేపీకే.. ప్రముఖ కంపెనీల విరాళాలు ఎంత ?

BJP 6060 Crores : ఎలక్టోరల్ బాండ్ల విరాళాల వివరాలను గురువారం సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్ వేదికగా విడుదల చేసింది.

  • Written By:
  • Publish Date - March 15, 2024 / 07:39 AM IST

BJP 6060 Crores : ఎలక్టోరల్ బాండ్ల విరాళాల వివరాలను గురువారం సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్ వేదికగా విడుదల చేసింది. 2019 ఏప్రిల్‌ 1 నుంచి 2024 ఫిబ్రవరి 15వ తేదీ దాకా జారీ చేసిన ఎన్నికల బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు సమకూరిన విరాళాల వివరాలు ఇందులో ఉన్నాయి. ఏయే కంపెనీ ఎన్ని విరాళాలు ఇచ్చింది ? ఏయే రాజకీయ పార్టీకి ఎన్ని విరాళాలు వచ్చాయి ? అనే వివరాలు ఇందులో ఉన్నాయి. అయితే ఏ పార్టీకి ఏ కంపెనీ ఎన్ని విరాళాలు ఇచ్చిందనే సమాచారాన్ని ఎస్‌బీఐ అందించకపోవడం గమనార్హం. ప్రత్యేకించి ఈ లిస్టులో రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా గ్రూప్, అదానీ గ్రూప్ వంటి దేశంలోని టాప్-3 కంపెనీల పేర్లు మచ్చుకు కూడా కనిపించకపోవడం గమనార్హం. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు ఎన్నికల బాండ్ల ద్వారా రూ.12,999 కోట్ల విరాళాలు అందాయి. అందులో సగం (రూ.6,060 కోట్లు) బీజేపీకే(BJP 6060 Crores) దక్కడం విశేషం.

We’re now on WhatsApp. Click to Join

విరాళాలు పొందడంలో టాప్ పార్టీలు..

విరాళాలు పొందిన పార్టీల లిస్టులో రెండో స్థానంలో రూ.1,609 కోట్లతో తృణమూల్‌ కాంగ్రెస్, రూ.1,421 కోట్లతో కాంగ్రెస్‌ పార్టీ, రూ.1,214 కోట్లతో బీఆర్‌ఎస్, రూ.775 కోట్లతో బిజూ జనతా దళ్, రూ.639 కోట్లతో డీఎంకే నిలిచాయి. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీకి రూ.337 కోట్లు విరాళంగా వచ్చాయి. టీడీపీకి రూ.219 కోట్లు, జనసేన పార్టీకి రూ.21 కోట్లు, ఉద్ధవ్ శివసేనకు రూ.158 కోట్లు, లాలూ ప్రసాద్ యాదవ్‌కు చెందిన ఆర్జేడీకి రూ.73 కోట్లు, ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.65 కోట్లు విరాళంగా అందాయి.

Also Read : Megha 966 Crores : ‘మేఘా’ రూ.966 కోట్ల విరాళాలు.. తెలుగు కంపెనీల చిట్టా ఇదిగో

విరాళాలు ఇవ్వడంలో టాప్ కంపెనీలు..

  • తమిళనాడుకు చెందిన ఫ్యూచర్‌ గేమింగ్, హోటల్‌ సరీ్వసెస్‌ అనే సంస్థ అత్యధిక విలువైన బాండ్లు కొనుగోలు చేసి టాప్‌–1గా నిలిచింది. కోయంబత్తూరుకు చెందిన ఈ సంస్థ రూ.1,368 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది.
  • హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రా సంస్థ రూ.966 కోట్లు, దాని అనుబంధ సంస్థ వెస్టర్న్‌ యూపీ పవర్‌ ట్రాన్స్‌మిషన్‌ కంపెనీ లిమిటెడ్‌ రూ.220 కోట్లు కలిపి మొత్తం రూ.1,186 కోట్ల విలువైన బాండ్లను కొని రెండో స్థానంలో నిలిచింది.
  •  ముంబయికి చెందిన క్విక్‌ సప్లై చైన్‌ సంస్థ రూ.410 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది.
  • అనిల్‌ అగర్వాల్‌కు చెందిన వేదాంత రూ.400 కోట్ల బాండ్లను కొనుగోలు చేసింది.
  • హల్దియా ఎనర్జీ సంస్థ రూ.377 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది.
  • వందల కోట్ల మేర భారీగా బాండ్లు కొనుగోలు చేసిన కంపెనీల జాబితాలో గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్, పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్, టోరెంట్‌ పవర్, మహీంద్రా అండ్‌ మహీంద్రా, భారతీ ఎయిర్‌టెల్, డీఎల్‌ఎఫ్‌ కమర్షియల్‌ డెవలపర్స్, ఎక్సెల్‌ మైనింగ్, వేదాంత లిమిటెడ్, అపోలో టైర్స్, లక్ష్మీ నివాస్‌ మిట్టల్, పీవీఆర్, సూలా వైన్స్, వెల్‌స్పన్, సన్‌ ఫార్మా తదితర ప్రఖ్యాత సంస్థలున్నాయి.
  • స్టీల్‌ టైకూన్‌ లక్ష్మీ మిత్తల్‌ తన సొంత డబ్బు రూ.35 కోట్లతో బాండ్లను కొన్నారు. దీంతోపాటు ఆయన కంపెనీలు మరో రూ.247 కోట్ల విలువైన బాండ్లను కొన్నాయి.
  • ఎస్సెల్‌ మైనింగ్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ విరాళం రూ.224 కోట్లు,  కెవెంటర్‌ ఫుడ్‌ పార్క్‌ ఇన్‌ఫ్రా లిమిటెడ్‌: రూ.194 కోట్లు, మదన్‌లాల్‌ లిమిటెడ్‌: రూ.185 కోట్లు, డీఎల్‌ఎఫ్‌ గ్రూప్‌: రూ.170 కోట్లు, జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ లిమిటెడ్‌: రూ.123 కోట్లు, బిర్లా కార్బన్‌ ఇండియా: రూ.105 కోట్లు, రుంగ్తా సన్స్‌: రూ.100 కోట్లు విలువైన బాండ్లు కొని విరాళాలు ఇచ్చారు.
  • కిరణ్‌ మజుందార్‌ షా, వరుణ్‌ గుప్తా, బీకే గోయెంకా, జైనేంద్ర షా, మోనికా వ్యక్తిగతంగా బాండ్లను కొన్నారు.
  • బజాజ్‌ ఆటో రూ.18 కోట్లు, బజాజ్‌ ఫైనాన్స్‌ రూ.20 కోట్లు, ఇండిగో సంస్థలు రూ.36 కోట్లు, స్పైస్‌జెట్‌ రూ.65 లక్షల బాండ్లను కొన్నాయి. ఇండిగో సంస్థకు చెందిన రాహల్‌ భాటియా రూ.20 కోట్ల బాండ్లను కొన్నారు.

Also Read :Free Coaching: గుడ్ న్యూస్.. ఆ అభ్యర్థులకు ఫ్రీ కోచింగ్