Himachal Pradesh హిమాచల్ ప్రదేశ్ లోని భార్మౌర్ లో హృదయాన్ని కదలించే సంఘటన చోటుచేసుకుంది. భారీగా కురుస్తున్న మంచు వల్ల కొండ ప్రాంతాల్లో ఉంటున్న జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర పనిమీద పెంపుడు శునకంతో బయటకు వెళ్లిన ఓ వ్యక్తి చలికి తట్టుకోలేక మధ్యలోనే పడిపోయి కన్నుమూశాడు. యజమాని మృతదేహానికి కాపలాగా ఆ పెంపుడు శునకం అక్కడే ఉండిపోయింది. మంచు కురుస్తున్నా, చలిగాలులు వీస్తున్నా అక్కడి నుంచి అది కదలలేదు.
-
- రెస్క్యూ సిబ్బందినీ దగ్గరికి రానివ్వని వైనం
- గడ్డకట్టించే చలిలోనూ మృతదేహం పక్కనే ఉన్న పిట్ బుల్
- హిమాచల్ ప్రదేశ్ లోని భార్మౌర్ లో ఘటన
खोने का दर्द… कैसे करे बयान
भारी फीट बर्फबारी में भी नहीं छोड़ा साथ, 4 दिन भूखा-प्यासा मालिक के शव की निगरानी करता रहा#chamba #dog pic.twitter.com/elMS11O7xZ— Pravin Yadav/प्रवीण यादव (@pravinyadav) January 26, 2026
ఆ వ్యక్తిని వెతుక్కుంటూ వెళ్లిన రెస్క్యూ సిబ్బందినీ కొంతసేపటి వరకు దగ్గరకు రానివ్వలేదు. యజమాని పట్ల ఆ మూగజీవానికి ఉన్న ప్రేమ, విశ్వాసం చూసి రెస్క్యూ సిబ్బందితో పాటు స్థానికులు కంటతడి పెట్టారు. నాలుగు రోజుల పాటు తిండి తినకుండా, అత్యంత కఠిన వాతావరణంలోనూ ఆ పిట్ బుల్ తన యజమాని మృతదేహాన్ని వదలకుండా కాపలా కాసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చివరకు రెస్క్యూ సిబ్బంది ఆ శునకాన్ని మచ్చిక చేసుకుని మృతదేహాన్ని తరలించారు.
