Site icon HashtagU Telugu

Brutal Murder : కళ్లను పెకిలించి.. మర్మాంగాలను కోసి.. దారుణంగా మర్డర్

Crime

Crime

Brutal Murder : దాదాపు ఆరు రోజులుగా కనిపించకుండా పోయిన శివాలయం పూజారి మనోజ్‌ కుమార్‌ అత్యంత కిరాతకంగా హత్యకు గురయ్యాడు. దుండగులు ఆయనను దారుణంగా కాల్చి చంపారు. కళ్లను బయటకు తీసి.. మర్మాంగాలను కోసి మర్డర్ చేశారు. బీహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లా దాణాపూర్ గ్రామ శివాలయంలో మనోజ్‌ పూజారిగా పని చేసేవాడు. ఇంటి నుంచి ఆలయానికి వెళ్లిన అతడు ఆరు రోజులైనా తిరిగి రాలేదు.  దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. డిసెంబర్ 16న ఓ చోట పొదల్లో అత్యంత దారుణ స్థితిలో ఒక మృతదేహం(Brutal Murder) కనిపించింది. ఆ డెడ్‌బాడీ పూజారి మనోజ్‌‌దే అని పోలీసులు నిర్ధారించారు. ఇక పూజారి మనోజ్ మరో సోదరుడు సురేశ్ షా కూడా కనిపించకుండా పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. మనోజ్ ఇంకో సోదరుడు అశోక్ కుమార్ షా బీజేపీ మాజీ డివిజనల్ ప్రెసిడెంట్.

We’re now on WhatsApp. Click to Join.

ఇంతకీ పూజారి మర్డర్ ఎందుకు జరిగింది ? ఆ వెంటనే పూజారి సోదరుడు సురేశ్ షా ఎందుకు మిస్సయ్యాడు ? అనే ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంది. ఈ ట్విస్ట్‌ను విప్పేందుకు పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. ఈక్రమంలో దాణాపూర్ గ్రామానికి వెళ్లిన పోలీసులపై స్థానికులు రాళ్లు రువ్వారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హంతకులు ఎవరో గుర్తించాలని పోలీసులను డిమాండ్ చేస్తూ రోడ్డుపై ధర్నాకు దిగారు.

Also Read: Nuzvid IIIT : సముద్రంలో కొట్టుకుపోయిన ఐదుగురు స్టూడెంట్స్.. నలుగురు సేఫ్