One Voter : ఈ పోలింగ్ బూత్‌ల గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు.. హ్యాట్సాఫ్ ఈసీ

One Voter : సార్వత్రిక ఎన్నికలకు యావత్ దేశం రెడీ అవుతోంది. ఒకే ఒక్క ఓటరు(One Voter) ఉన్న ఓ కుగ్రామం కూడా ఈ కీలక ఘట్టానికి  సమాయత్తం అవుతోంది.

  • Written By:
  • Publish Date - April 10, 2024 / 01:54 PM IST

One Voter : సార్వత్రిక ఎన్నికలకు యావత్ దేశం రెడీ అవుతోంది. ఒకే ఒక్క ఓటరు(One Voter) ఉన్న ఓ కుగ్రామం కూడా ఈ కీలక ఘట్టానికి  సమాయత్తం అవుతోంది. కనీసం సెల్ ఫోన్ సిగ్నల్ అందని ఓ పల్లె సైతం ఓట్ల పండుగకు వేదికగా నిలువబోతోంది. నడి సముద్రంలోని దీవులూ ప్రజాస్వామ్య పర్వదినానికి సాక్ష్యంగా నిలువబోతున్నాయి. వివరాలు చూద్దాం..

We’re now on WhatsApp. Click to Join

గుజరాత్‌లోని గిర్‌లో వన్యప్రాణుల అభయారణ్యం ఉంది. ఈ అడవి లోపలున్న మారుమూల ప్రాంతం పేరు బనేజ్‌. ఇక్కడ కూడా ఓటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. బనేజ్‌లో ఉన్నశివాలయం పూజారి మహంత్ హరిదాస్జీ కోసం ఈ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. బనేజ్ గ్రామం గిర్ సోమనాథ్ జిల్లా పరిధిలోకి వస్తుంది. అయితే బనేజ్ బూత్ జునాగఢ్ లోక్‌సభ స్థానం పరిధిలోకి వస్తుంది. 2007 సంవత్సరం నుంచే ఇక్కడ ఒకే ఒక్క ఓటరు కోసం పోలింగ్‌ బూత్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడి శివాలయం సమీపంలోని అటవీశాఖ కార్యాలయంలో పోలింగ్ బూత్‌ ఉంటుంది.

Also Read : Raju: ఉండి నుంచి పోటీ చేస్తా..48 గంటల్లో టికెట్ పై స్పష్టత వస్తుంది..రఘురాజు

  • గుజరాత్‌లోని పోర్‌బందర్‌ పరిధిలో ఉన్న సత్విర్దా నెస్, భుఖ్‌బరా నెస్, ఖరవీరా నెస్ గ్రామాలు .. ద్వారక జిల్లా కేంద్రం సమీపంలోని అరేబియా సముద్రంలోని ఆజాద్ ద్వీపం..  జునాగఢ్ జిల్లాలోనికన్కై గ్రామంలోనూ పోలింగ్ బూత్‌లు ఏర్పాటవుతాయి. కన్కైలోని ప్రజలను కేవలం మనం వైర్‌లెస్ సెట్ ద్వారానే కమ్యూనికేషన్ చేయగలం. ఎందుకంటే అక్కడికి  టెలికాం సిగ్నల్స్ అందవు.
  • సాప్ నెస్ బిలియా.. గిర్ అడవి సమీపంలోని ఈ పల్లె గుజరాత్‌లోని గిర్ సోమ్‌నాథ్ జిల్లాలోనే ఉంది. 23 మంది పురుషులు, 19 మంది మహిళా ఓటర్లు నివసిస్తున్న ఈ ఊరిలోనూ పోలింగ్ బూత్‌ను ఏర్పాటు చేయనున్నారు.
  • షియాల్‌బెట్ ద్వీపం.. గుజరాత్‌లోని అమ్రేలి జిల్లా తీరంలో ఉంది. దీని నుంచి ప్రధాన భూభాగానికి వంతెన కానీ, రోడ్డు కానీ లేదు. పడవ ద్వారానే ఈ ఊరి నుంచి ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. ఇక్కడ కూడా 5 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేయనున్నారు.
  • అలియాబెట్ ద్వీపం.. గుజరాత్‌లోని భరూచ్ జిల్లాలో ఉన్న నర్మదా నది డెల్టాలో ఉంది. ఇక్కడ 254 మంది ఓటర్లు ఉన్నారు. వారి కోసం పోలింగ్ బూత్ ఏర్పాటు చేయనున్నారు.
  • రథదా బెట్ ద్వీపం.. గుజరాత్‌లోని  మహిసాగర్ జిల్లా కడన రిజర్వాయర్ జలాల్లో ఉంది. ఇక్కడ కూడా పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ ఊరిలో 725 మంది ఓటర్లు ఉన్నారు.

Also Read :Ruhani Sharma : టాప్ లెస్ లో రుహానీ శర్మ బ్యూటిఫుల్ పిక్స్