MIG 21 Fighter jet : భారత వాయుసేన (IAF) సుదీర్ఘ కాలం సేవలు అందించిన మిగ్-21 ఫైటర్ జెట్‌లకు వీడ్కోలు పలకడానికి సిద్ధమవుతోంది. దశాబ్దాలుగా భారత గగనతల రక్షణలో కీలక పాత్ర పోషించిన ఈ విమానాలు, క్రమంగా తమ సేవలను నిలిపివేస్తున్నాయి. మిగ్-21 జెట్‌లు భారత వాయుసేనలో దాదాపు 60 సంవత్సరాల పాటు సేవలు అందించాయి. 1960వ దశకంలో సోవియట్ యూనియన్ నుండి కొనుగోలు చేయబడిన ఈ జెట్‌లు, అనేక యుద్ధాలలో ఆపరేషన్లలో భారతదేశానికి అండగా నిలిచాయి.
ఎందుకు వాటిసేవలను నిలిపి వేస్తున్నారంటే?
మిగ్-21 విమానాలు అప్పట్లో అత్యంత అధునాతన యుద్ధ విమానాలలో ఒకటిగా పరిగణించబడ్డాయి. వీటి వేగం, విన్యాస సామర్థ్యం భారత వాయుసేనకు గొప్ప బలాన్ని అందించాయి. అయితే, కాలక్రమేణా, ఈ విమానాలు పాతబడిపోయాయి. వాటి నిర్వహణ ఖర్చులు పెరిగాయి. అంతేకాకుండా, గత కొన్నేళ్లుగా మిగ్-21 విమానాలకు సంబంధించి అనేక ప్రమాదాలు జరిగాయి. వీటిని “ఎగిరే శవపేటికలు” అని కూడా పిలవడం ప్రారంభించారు. వరుసగా ప్రమాదాలు జరగడం, ట్రైనింగ్ పొందిన పైలట్లను కోల్పోవడం వాయుసేనకు తీవ్ర నష్టాన్ని కలిగించింది.ఈ కారణాలన్నీ భారత వాయుసేన వీటిని విడనాడాలని నిర్ణయించుకోవడానికి దారితీశాయి.
ప్రస్తుతం మిగ్-21 స్థానంలో కొత్త తరం యుద్ధ విమానాలను ప్రవేశపెడుతున్నారు. తేజస్ (LCA – Light Combat Aircraft) స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేయబడిన విమానం మిగ్-21కి ప్రధాన ప్రత్యామ్నాయంగా ఉంది. తేజస్‌తో పాటు, రాఫెల్ వంటి అత్యాధునిక యుద్ధ విమానాలను కూడా భారత వాయుసేన తన బలాన్ని పెంచుకోవడానికి ఉపయోగిస్తోంది. ఈ కొత్త విమానాలు మెరుగైన సాంకేతికత, ఆయుధ వ్యవస్థలు మరియు భద్రతా లక్షణాలను కలిగి ఉన్నాయి, ఇవి భారత గగనతల భద్రతను మరింత బలోపేతం చేస్తాయి.
అయితే, మిగ్-21 విమానాలను ఏం చేయబోతున్నారనే ప్రశ్న ప్రస్తుతం అందరి మదిలో మెదులుతోంది. ఇక వాటి బాడీ పార్ట్స్‌ను ఏం చేయబోతున్నారని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వీటిలో కొన్ని భాగాలను మ్యూజియంలలో ప్రదర్శనకు ఉంచే అవకాశం ఉంది. తద్వారా వాటి చారిత్రక ప్రాముఖ్యతను భవిష్యత్ తరాలకు తెలియజేయవచ్చు. మిగిలిన భాగాలను స్క్రాప్‌గా విక్రయించడం లేదా రీసైకిల్ చేయడం జరుగుతుంది. అయితే, ఈ విమానాలలోని కొన్ని కీలకమైన భాగాలు లేదా సాంకేతికత భద్రతా కారణాల దృష్ట్యా నాశనం చేయబడవచ్చు. ఎందుకంటే వాటిని ఎవరైనా దొంగిలించి శక్తు దేశాలకు విక్రయించే ఆస్కారం లేకపోలేదు.
మిగ్-21కు వీడ్కోలుతో భారత వాయుసేనలో ఒక శకం ముగిసినట్లు సూచిస్తుంది.ఈ విమానాలు భారత రక్షణ చరిత్రలో తమదైన ముద్ర వేశాయి. వాటి సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. గతంలో భారత్, పాక్ నడుమ ఉద్రిక్తతల వేళ భారత మిగ్ 21 అమెరికాకు చెందిన ఎఫ్ 35ను కూల్చినట్లు గతంలో కథనాలు కూడా వచ్చాయి. కాగా, కొత్త తరం విమానాల రాకతో భారత వాయుసేన మరింత శక్తివంతంగా మారుతుందని ఆశిద్దాం.