Site icon HashtagU Telugu

Indigo Flight : పీకలదాకా తాగి ఫ్లైట్ ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేసేందుకు యత్నంచిన ప్రయాణికుడు అరెస్ట్

Indigo

1028434 Indigo Represent

గతకొన్నాళ్లుగా విమానాల్లో (Indigo Flight) ప్రయాణికుల వికృత చేష్టలు పరాకాష్టకు చేరుతున్నాయి. మద్యం మత్తులో తోటి ప్రయాణికులపై దాడి చేయడం, సిబ్బందిని దుర్భాషలాడటం, మూత్ర విసర్జన చేయడం వంటి ఘటనలో ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటివరకు ఇలాంటి ఘటనల్లో 8 మంది ప్రయాణీకులను అరెస్టు చేశారు. తాజాగా ఇలాంటి ఘటనే మరొక్కటి చోటుచేసుకుంది. ఢిల్లీ-బెంగళూరు ఇండిగో విమానం ఎమర్జెన్సీ డోర్ ఫ్లాప్‌ను తెరవడానికి ప్రయత్నించినందుకు ఓ ప్రయాణికుడిని సిబ్బంది అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. 40 ఏళ్ల మద్యం మత్తులో ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేసేందుకు ప్రయత్నించినట్లు ఇండిగో అధికారులు తెలిపారు.

ఇండిగో ఎయిర్ లైన్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీ నుంచి బెంగళురుకు వెళ్తున్న విమానంలో ఫుల్ గా మద్యం సేవించిన ప్రయాణీకుడు ఎమర్జెన్సీ డోర్ ప్లాప్ ఓపెన్ చేసేందుకు యత్నించాడు. ఇది చూసిన సిబ్బంది కెప్టెన్ను అప్రమత్తం చేసి ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఇలాంటి ఘటనలెన్నో వెలుగు చూశాయని బోర్డులో వికృత ప్రవర్తనను ఎదుర్కోవడానికి, ఏవియేషన్ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) CAR, సెక్షన్ 3- ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్, సిరీస్ M, పార్ట్ 6ను అంతరాయం కలిగించే ప్రయాణీకులను నిర్వహించడం పేరుతో జారీ చేసింది. ఈ ఘటనకు పాల్పడిన సదరు ప్రయాణీకుడిని బెంగళూరు సీఐఎస్ఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు.