Business Idea : మీ ఊరిలో ఖాళీ స్థలం ఉందా, ఈ పండ్ల తోటతో నెలకు రూ. 1 లక్ష పక్కా…పెట్టుబడి అవసరం లేదు…!

  • Written By:
  • Updated On - March 29, 2023 / 07:14 PM IST

నేటి యువత ఉద్యోగాలకంటే…వ్యాపారంపైన్నే (Business Idea) ఆసక్తి చూపిస్తున్నారు. ఈనేపథ్యంలో ఎలాంటి వ్యాపారం చేస్తే బాగుంటుందని సెర్చ్ చేస్తున్నారు. వ్యాపారం ప్రారంభించాలనుకునేవారికి కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కార్ ముద్ర స్కీం ద్వారా రుణాలు అందిస్తోంది. అంతేకాదు ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు కూడా వడ్డీకి రుణాలు కూడా రుణాలు అందిస్తున్నాయి. అయితే మీకు మీ గ్రామంలో ఖాళీ స్థలం ఉన్నట్లయితే మీకో మంచి బిజినెస్ ఐడియా చెబుతాం. పెట్టుబడి చాలా తక్కువ. ఆదాయం మాత్రం భారీగానే ఉంటుంది. ఆ వ్యాపారమేంటో చూద్దాం.

పండ్లకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. సీజన్ను బట్టి డిమాండ్ పెరుగుతుంది కానీ తగ్గదు. ఆరోగ్యానికి అధికప్రాముఖ్యతనిచ్చేవారు తప్పనిసరిగా పండ్లను కొనుగోలు చేస్తుంటారు. అయితే ఓ రైతు సంప్రదాయ వ్యవసాయాన్ని పక్కనపెట్టి పండ్లతోటవైపు మళ్లాడు. తనకున్న కొద్దిపాటి భూమిలో జాక్ ఫ్రూట్ ను సాగు చేస్తున్నాడు. నెలకు లక్షల్లో ఆధాయం పొందుతున్నాడు. జాక్ ఫ్రూట్ ను పనాసపండు అని కూడా అంటారు. ప్రపంచంలో అత్యధికంగా పనాస పండును ఉత్పత్తి చేసే దేశాల్లో మన భారతదేశం ఒకటి. ఈ పండులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పనాసను క్రమంతప్పకుండా తిన్నట్లయితే అద్భుతమైన ప్రయోజనాలను లభిస్తాయి.

కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు…ఈపండును పండించేరైతుకు కూడా లాభాలను తెచ్చిపెడుతున్నాయి. రాజస్థాన్ లోని భరత్ పూర్ తమకున్న కొద్దిపాటి భూమిలో ఈపంటను సాగుచేస్తున్నారు అక్కడి రైతులు. వేలకు వేలు పెట్టి ఎరువులను కొనుగోలు చేసే బదులు ఖర్చులేకుండానే సేంద్రీయ ఎరువులను వాడుతున్నారు. ఈ సీజనల్ పండ్లను తోటను సాగు చేస్తూ నెలకు లక్షరూపాయలకు పైగా సంపాదిస్తున్నాడు. ఈ ప్రాంతంలో చాలా మంది రైతులు వ్యవసాయాన్ని వదిలి వాణిజ్య పంటలను పండించడానిక ఇదే కారణం.

జాక్ ఫ్రూట్ తోటను సాగుచేస్తున్న కైలాస్ ఐదేళ్ల క్రితం నాసిక్ నుంచి 50మొక్కలను తీసుకువచ్చి సాగు ప్రారంభించాడు. ఈ చెట్టు మూడు నుంచి నాలుగేళ్లలో పెరిగింది. ఆ తర్వాత ఫలాలు ఇవ్వడం ప్రారంభించింది. ఒక పండు 20 నుంచి 40కిలోల బరువు ఉంటుందని తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ పండ్లకు మంచి గిరాకీ ఉందని ఢిల్లీ , హర్యానీ, యూపీ, గుజరాత్, మధ్యప్రదేశ్ తోపాటు దేశంలోని అనేక ప్రాంతాలకు ఈ పండ్లను సరఫరా చేస్తూ మంచి లాభాలను అర్జిస్తున్నారు.