AMCA : దేశీయ రక్షణ రంగంలో మరో ముఖ్యమైన మైలురాయిగా నిలిచేలా రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. భారత ప్రభుత్వం ‘అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్’ (AMCA) ప్రాజెక్టును కార్యరూపంలోకి తేవడానికి సన్నాహాలు మొదలుపెట్టింది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ ఎగ్జిక్యూషన్ ప్లాన్‌కు ఆమోదం తెలపడంతో, దేశీయంగా తయారయ్యే ఐదో తరం యుద్ధ విమానం అభివృద్ధిలో వేగం వచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టును బెంగళూరులో ఉన్న డీఆర్‌డీవోకు చెందిన ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఏడీఏ) ముఖ్యంగా అమలు చేయనుంది. ఇతర దేశీయ సంస్థలతో కలిసి ఈ యుద్ధవిమానం అభివృద్ధి జరగనుంది. ప్రాజెక్టులో భాగంగా ఉన్న కీలక భాగస్వామిగా హైదరాబాద్‌కు చెందిన వేమ్ టెక్నాలజీస్ లిమిటెడ్ సంస్థ ఫ్యాబ్రికేషన్ పనుల్లో భాగం తీసుకుంది. విమానం డిజైన్‌ను ఏడీఏ రూపొందించింది.
Read Also: Mahanadu : ‘మహానాడు’..అసలు ఈ పేరు ఎలా వచ్చింది..?
అమ్కా (AMCA) ప్రాజెక్టు భారతదేశ స్వావలంబన లక్ష్యానికి సహాయపడే విధంగా ఉంది. స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేస్తున్న ఈ విమానం ఐదో తరం సాంకేతికతను కలిగి ఉంటుంది. ‘ఏరో ఇండియా – 2025’ కార్యక్రమంలో ఈ యుద్ధవిమాన నమూనాను తొలిసారి ప్రదర్శించారు. అత్యాధునిక రూపకల్పన, కృత్రిమ మేధ (AI) ఆధారిత ఎలక్ట్రానిక్ పైలట్ వ్యవస్థ, నెట్ ఆధారిత ఆయుధ వ్యవస్థలు ఈ విమానానికి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తున్నాయి. అదనంగా, ఈ యుద్ధవిమానాన్ని మానవ సహితంగానూ, మానవ రహితంగానూ (Unmanned Mode) ఉపయోగించుకునేలా రూపొందిస్తున్నారు. దీని బరువు సుమారు 25 టన్నులు కాగా, ప్రతికూల వాతావరణాల్లోనూ మెరుగైన పనితీరును చూపగలుగుతుంది. వేగవంతమైన మానోవర్ సామర్థ్యం, స్టెల్త్ లక్షణాలు కలిగి ఉండటం దీన్ని మరింత ఆధునికంగా మారుస్తుంది.
ఈ ప్రాజెక్టు దేశీయంగా తాయారవుతున్న టెక్నాలజీలపై విశ్వాసాన్ని పెంచుతోంది. విదేశీ ఆధారాన్ని తగ్గించి, స్వదేశీ పరిశోధనలకు ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా భారత్ తన రక్షణ వ్యవస్థను మరింత బలపర్చుకోనుంది. దీని ద్వారా భారత్ రక్షణ రంగంలో అత్యాధునిక దేశాలతో పోటీ పడగలిగే స్థాయికి చేరనుంది. ఈ అభివృద్ధి కేవలం సాంకేతికంగా కాకుండా, ఆర్థికపరంగా, పారిశ్రామికంగా దేశానికి నూతన దిశగా మార్గనిర్దేశనం చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశీయ నిర్మాణ సంస్థలు, పరిశోధనా సంస్థలు, విద్యాసంస్థలు కలిసి పనిచేయడం ద్వారా ‘మేక్ ఇన్ ఇండియా’ భావనకు బలాన్ని అందించనుంది ఈ ప్రాజెక్టు.
Read Also: jharkhand : ఝార్ఖండ్‌లో ఎన్‌కౌంటర్.. మావోయిస్టు కీలక నేత మృతి..!