Uttarakhand: అనుమానం పెనుభూతం అంటారు. మనిషి మనసులో ఒక్కసారి అనుమానం స్టార్ అయితే, దానిపై క్లారిటీ వచ్చే వరకు మదన పడుతూనే ఉంటారు. ఇలానే ఓ మహిళ విషయంలో జరిగింది. ఆ మహిళకు 2019లో వివాహమైంది. పెళ్లైన తర్వాత భర్త దగ్గరకు రానివ్వలేదు. గట్టిగా అడిగితే అదనపు కట్నం కావాలని డిమాండ్ చేయడం ప్రారంభించాడు. కట్నం ఇచ్చే వరకు ముట్టుకునేది లేదని తేల్చి చెప్పాడు. అత్తమామ కూడా పట్టించుకోలేదు. ఇక ఆమెకు అనుమానం మరింత ఎక్కవైంది. చివరికి భర్త గురించి ఓ షాకింగ్ విషయం తెలిసింది.
ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్ జిల్లా హల్ద్వానీకి చెందిన ఓ మహిళ తన భర్త స్వలింగ సంపర్కుడని అనుమానించింది. ఈ అనుమానమై పెను భూతమైంది. ఎందుకంటే పెళ్లి తర్వాత ఒక్కరోజు కూడా ఆమెను అతడు తాకలేదు. ఆమె ప్రయత్నించినా, అతడు దూరం జరిగిపోయేవాడు. గట్టిగా అడిగితే తనకు అదనపు కట్నం కావాలని వేధించేవాడు. అత్తమామలు కూడా కొడుకుకే మద్దతుగా మాట్లాడేవారు.ఈ క్రమంలో ఆమె తన భర్తపై అనుమానం పెంచుకుంది. అతడు స్వలింగ సంపర్కుడేమోనని డౌట్ వచ్చింది. అది తెలుసుకునేందుకు నిఘా వేసింది.
ఇందుకోసం పక్కా ప్లాన్ కూడా వేసింది. ఏదో ఒక రోజు భర్త బండారం బయట పెట్టాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం ఓ ఫంక్షన్ వేదికగా చేసుకుంది. కొన్ని రోజుల క్రితం బావ బిడ్డకు నామకరణం ఫంక్షన్ కోసం కుటుంబ సభ్యులందరూ ఓ హోటల్‌కు వెళ్లారు. పార్టీలో కొద్ది సేపటి తర్వాత ఆమెకు తన భర్త కనిపించలేదు. మొత్తం వెతకగా ఓ గదిలో భర్త కనిపించాడు. అయితే అతడు అప్పుడు తన మగ స్నేహితుడితో అభ్యంతరకరమైన రీతిలో ఉండడం చూసింది భార్య. దీంతో తన భర్త స్వలింగ సంపర్కుడని ఆ మహిళకు అర్ధమైంది. పూర్తి క్లారిటీ వచ్చింది. దీంతో ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది. భర్త, అత్తమమాలు తనను మోసం చేశారని ఫిర్యాదు చేసింది. నెటిజన్లు కూడా ఆ అమెకే సపోర్టు చేస్తున్నారు. తన వద్ద మగతం లేనప్పుడు ఎందుకు పెళ్లి చేసుకున్నాడని దుమ్మెత్తిపోసుకున్నాడు. బంగారం లాంటి ఆమె జీవితం నాశనం చేశాడని, పోయిన యవ్వనం తిరిగి వస్తుందా అని ప్రశ్నిస్తున్నారు.