కరోనా మహమ్మారి విరుచుకు పడుతున్న సమయంలో ‘మేమున్నాం’ అంటూ అండగా నిలిచారు కరోనా వారియర్స్. పగలు, రాత్రి పని లేకుండా విధులు నిర్వహించి ఎంతోమంది ప్రాణాలు కాపాడారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి వైద్య సేవలందించారు. సేవలతో పాటు వ్యాక్సినేషన్ లోనూ ఆరోగ్య కార్యకర్తలు ముందుంటున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన వ్యాక్సిన్ లక్ష్యాన్ని చేరుకునేందుకు నిరంతరం శ్రమిస్తున్నారు. మారుమూల ప్రాంతాలు, పంటపొలాలు, పెళ్లిళ్లు, ఇతర శుభాకార్యాలకు సైతం వెళ్తూ వ్యాక్సిన్ వేస్తూ కరోనా కట్టడికి తమవంతు చేయూత అందిస్తున్నారు.
రాజస్థాన్ రాష్ట్రం బార్మేర్ జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు ఓ ఆరోగ్య కార్యకర్త ఒంటెపై వెళ్లి టీకా వేస్తోంది. మారుమూల ప్రాంతాలకు రవాణా సదుపాయాలు లేకపోవడంతో ఇతర మార్గాల ద్వారా వెళ్తూ వ్యాక్సిన్ వేస్తున్నారు. ఈ దృశ్యాలను కేంద్రమంత్రి మన్‌సుఖ్ మాండవీయ ట్విటర్ లో షేర్ చేశారు. వ్యాక్సిన్ వేసేందుకు ఆమె తీసుకున్న చొరవను అభినందించారు.
संकल्प और कर्तव्यनिष्ठा का संगम।
राजस्थान के बाड़मेर जिले में टीकाकरण अभियान की तस्वीरें।#HarGharDastak pic.twitter.com/p2nngJvrhy
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) December 24, 2021