Anand Mahindra: ఆనంద్ మహీంద్రా దృష్టిలో పడిన సామాన్యుడు..!

ఓ సాధారణ కార్మికుడు బజాజ్ చేతక్ (Bajaj Chetak)ను మెషిన్ గా మార్చాడు.

Published By: HashtagU Telugu Desk
Anand Mahindra Bajaj Chetak

Anan

ఓ నిర్మాణ రంగ కార్మికుడి ఆవిష్కరణను ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) తన ట్విట్టర్ పేజీ ద్వారా కోటి మంది ఫాలోవర్లకు పరిచయం చేశారు. ఓ కార్మికుడు బజాజ్ చేతక్ ను పవర్ ట్రైనర్ గా మార్చాడు. ఎత్తయిన భవన నిర్మాణాలలో కింది నుంచి పైకి మెటీరియల్ ను పంపించేందుకు క్రేన్లను ఉపయోగిస్తుంటారు. అలాగే పవర్ మెషిన్లు కూడా వినియోగంలో ఉన్నాయి. కానీ, అంత ఖర్చు చేసే స్థోమత లేని ఓ సాధారణ కార్మికుడు బజాజ్ చేతక్ ను (Bajaj Chetak) మెషిన్ గా మార్చాడు.

స్టార్ చేసి, రేజ్ ఇస్తే చాలు కింద నుంచి మెటీరియల్ తాడు ద్వారా పైకి వెళుతుండడాన్ని వీడియోలో చూడొచ్చు. సదరు తాడు ఒకవైపు చేతక్ ఇంజన్ కు అనుసంధానించి ఉంది. దీన్ని అద్భుత ఆవిష్కరణగా పేర్కొన్న ఆనంద్ మహీంద్రా కొన్ని చిన్న మార్పులతో రోజువారీ వినియోగానికి అనుకూలంగా మార్చొచ్చని పేర్కొన్నారు. ‘‘అందుకే వాటిని పవర్ ట్రెయిన్లు అని అంటున్నాం. వాహన ఇంజన్ల శక్తిని ఎన్నో రకాలుగా ఉపయోగించుకోవచ్చు. వీటి ధరను మరింత తగ్గించినట్టయితే ఈ స్కూటర్ తో మరింత మెరుగ్గా ఉంటుంది‘‘అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.

  Last Updated: 06 Dec 2022, 03:02 PM IST