Varanasi : గంగానదిలో మునిగిన బోటు…బోటులో 34మంది ఏపీకి చెందినవారే..!!

ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో శనివారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. 34మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ గంగా నదిలో బోల్తాపడింది. సకాలంలో గుర్తించిన రెస్య్కూటీం వారందర్నీ ప్రాణాలతో కాపాడింది. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. చికిత్స కోసం వారిని ఆసుపత్రికి తరలించారు. గంగానది మధ్యలో షీట్ల ఘాట్ ఎదురుగా ఈ ప్రమాదం జరిగింది. బోటు నదిలో పడిపోయాగానే ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అరుపులు కేకలతో భయానకర పరిస్థితి నెలకొంది. సిబ్బంది సకాలంలో స్పందించడంతో తాము […]

Published By: HashtagU Telugu Desk
Varanasi

Varanasi

ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో శనివారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. 34మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ గంగా నదిలో బోల్తాపడింది. సకాలంలో గుర్తించిన రెస్య్కూటీం వారందర్నీ ప్రాణాలతో కాపాడింది. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. చికిత్స కోసం వారిని ఆసుపత్రికి తరలించారు. గంగానది మధ్యలో షీట్ల ఘాట్ ఎదురుగా ఈ ప్రమాదం జరిగింది.

బోటు నదిలో పడిపోయాగానే ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అరుపులు కేకలతో భయానకర పరిస్థితి నెలకొంది. సిబ్బంది సకాలంలో స్పందించడంతో తాము ప్రాణాలతో బయటపడ్డామని ప్రయాణికులు తెలిపారు. బోటులో ప్రయాణిస్తున్న వారంత ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారిగా గుర్తించారు. ప్రయాణికులు లైఫ్ జాకెట్లు ధరించలేదు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

 

  Last Updated: 26 Nov 2022, 12:03 PM IST