Site icon HashtagU Telugu

Fact Check : శశిథరూర్ కాలికి గాయంపై దుమారం.. ఫ్యాక్ట్ చెక్‌లో ఏం తేలిందో తెలుసా ?

Shashi Tharoors Leg Injury Fact Check Fake News Shakti Collective

Fact Checked By factly

Fact Check : కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ఎంపీ శశి థరూర్ కాలికి గాయమైందని, ఆ ఫొటోను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి థరూర్ కాలికి 2022 సంవత్సరంలో గాయమైంది. అప్పటి ఫొటోనే.. తాజా ఫొటో అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. శశి థరూర్ కాలికి గాయమైనట్టుగా, పాదానికి ప్లాస్టర్ వేసినట్టుగా ఉన్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇటీవలే ఆయనకు గాయాలయ్యాయని కొందరు ప్రచారం చేస్తున్నారు. ఇందులో నిజం ఎంత ? అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం.

Also Read :Amit Shah In Bastar : రేపు రాత్రి బస్తర్‌లోనే అమిత్‌షా బస.. మావోయిస్టుల కంచుకోటలో సాహసోపేత పరిణామం

ఫ్యాక్ట్ చెక్‌ ప్రక్రియలో భాగంగా మేం శశిథరూర్ కాలికి గాయమైన ఫొటోను ఇంటర్నెట్‌లో(Fact Check) రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. దీంతో ఆ ఫొటో ఇప్పటిది కానే కాదని.. 2022 డిసెంబరులో అప్‌లోడ్ చేసిన ఫొటో అని వెల్లడైంది. అప్పట్లో శశి థరూర్ స్వయంగా ఈ ఫొటోను ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారని తేలింది. అప్పట్లో ఆయన ట్వీట్ చేస్తూ..  ‘‘పార్లమెంటు హాలులో నడిచే క్రమంలో.. ఒక మెట్టు తప్పిపోయి నా ఎడమ పాదం మోచు తిన్నది’’ అని  రాసుకొచ్చారు. 2022లో ఈ సంఘటనకు సంబంధించిన పలు వార్తా కథనాలు కూడా పబ్లిష్ అయ్యాయి.

Also Read :Mohan Babu : ఇంట్లోనే ఉన్నాను, పారిపోలేదు.. దయచేసి నిజాలే చెప్పండి : మోహన్ బాబు

2024 డిసెంబర్ 12న.. 

తదుపరిగా మేం శశి థరూర్‌కు చెందిన సోషల్ మీడియా ప్రొఫైల్స్‌ను చెక్ చేశాం. వాటిలో ప్రత్యేకించి గత కొన్ని వారాల ట్వీట్స్‌ను చెక్ చేశాం. ఆ ట్వీట్స్‌లో ఎక్కడ కూడా కాలికి గాయాలైన ఫొటోలు కానీ, దానితో ముడిపడిన మెసేజ్‌లు కానీ లేనే లేవు. 2024 డిసెంబర్ 12న ఆయన  చేసిన ఒక ట్వీట్ దొరికింది. గతంలో తన కాలికి గాయమైన ఫొటోలను వైరల్ చేస్తున్న, ట్రోల్ చేస్తున్న వారిని విమర్శిస్తూ థరూర్  ఆ తేదీన ఒక పోస్ట్ చేశారు. తాను ప్రస్తుతం పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు.

ఇంటర్నెట్‌లో..

తదుపరిగా మేం ఇంటర్నెట్‌‌లో కీవర్డ్ సెర్చ్ చేశాం. థరూర్ కాలికి గాయమైంది అనే కోణంలో ఏ కీవర్డ్‌ను టైప్ చేసినా ఇంటర్నెట్ సెర్చ్ రిజల్ట్ రాలేదు.

నిజం ఇదీ

శశిథరూర్ కాలికి గాయమైన ఫొటో 2022 డిసెంబర్‌ నాటిది. పార్లమెంట్‌లో నడుస్తుండగా ఆయన ఎడమ పాదం మోచు తిన్నది. అందువల్ల, ఈ ఫొటోపై జరుగుతున్న ప్రచారమంతా తప్పు.

(ఈ న్యూస్ స్టోరీని ఒరిజినల్‌గా  ‘ఫ్యాక్ట్‌లీ’ వెబ్‌సైట్ ప్రచురించింది. ‘శక్తి కలెక్టివ్’‌లో భాగంగా దీన్ని ‘హ్యాష్ ట్యాగ్‌యూ తెలుగు’ రీపబ్లిష్ చేసింది)