995 Jobs -IB : డిగ్రీ అర్హతతో ఇంటెలిజెన్స్ బ్యూరో‌లో 995 జాబ్స్

995 Jobs -IB : ఇంటెలిజెన్స్ బ్యూరో(IB)లో ఉద్యోగ అవకాశమిది. 995 అసిస్టెంట్​ సెంట్రల్ ఇంటెలిజెన్స్​ ఆఫీసర్ (ACIO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

  • Written By:
  • Publish Date - November 27, 2023 / 11:45 AM IST

995 Jobs -IB : ఇంటెలిజెన్స్ బ్యూరో(IB)లో ఉద్యోగ అవకాశమిది. 995 అసిస్టెంట్​ సెంట్రల్ ఇంటెలిజెన్స్​ ఆఫీసర్ (ACIO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఏదైనా డిగ్రీ చేసిన వారు ఈ జాబ్స్‌కు అర్హులు. 2023 డిసెంబర్ 15 నాటికి 18 ఏళ్ల నుంచి 27 ఏళ్ల మధ్యలో వయసున్న వారు వీటికి అర్హులు. ఈ పోస్టులకు ఎంపికయ్యే వారికి శాలరీ పే స్కేలు రూ.44,900 నుంచి రూ.1,42,400 వరకు ఉంటుంది. మొత్తం 995 అసిస్టెంట్​ సెంట్రల్ ఇంటెలిజెన్స్​ ఆఫీసర్ పోస్టులలో 377  ఓపెన్ కోటాలో భర్తీ చేస్తారు. ఓబీసీలకు 222, ఎస్సీలకు 134, ఎస్టీలకు  133, ఈడబ్ల్యూఎస్ కేటగిరి వారికి 129 పోస్టులను కేటాయించారు.

We’re now on WhatsApp. Click to Join.

అభ్యర్థులు అందరూ రిక్రూట్​మెంట్​ ప్రాసెసింగ్ ఫీజుగా రూ.450 చెల్లించాలి. అయితే జనరల్​, ఈడబ్ల్యూఎస్​, ఓబీసీ (పురుషులు) అభ్యర్థులు అప్లికేషన్​ ఫీజుగా రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు అప్లికేషన్ ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ఆన్​లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ డిసెంబరు 15. అప్లికేషన్ ఫీజు చెల్లించడానికి చివరి తేదీ డిసెంబరు 19.  ఆంధ్రప్రదేశ్​లోని పరీక్ష కేంద్రాల జాబితాలో విజయనగరం, విశాఖపట్నం, విజయవాడ, రాజమహేంద్రవరం, కాకినాడ, గుంటూరు, చీరాల, తిరుపతి, కడప, కర్నూలు, అనంతపురం ఉన్నాయి. తెలంగాణలోని పరీక్ష కేంద్రాల జాబితాలో  హైదరాబాద్​, కరీంనగర్​, ఖమ్మం, మహబూబ్​నగర్​, వరంగల్ ఉన్నాయి.

Also Read: IT Raids : రామగుండంలో 2 కోట్లు సీజ్.. నారాయణపేట ఎమ్మెల్యే అనుచరులపై ఐటీ రైడ్స్

అభ్యర్థులకు తొలుత టైర్​-1, టైర్​-2 పరీక్షలను నిర్వహిస్తారు. వీటిలో మెరిట్ సాధించిన వారిని ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇందులోనూ క్వాలిఫై అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్​, మెడికల్ ఎగ్జామినేషన్ చేసి.. అసిస్టెంట్​ సెంట్రల్​ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టులకు ఎంపిక చేస్తారు.అభ్యర్థులు కేంద్ర హోంశాఖ అధికారిక వెబ్​సైట్​ https://www.mha.gov.in/en ‌లో తమ పేరు మీద ఒక అకౌంట్​ను క్రియేట్ చేసుకొని ఆన్‌లైన్‌లో(995 Jobs -IB) అప్లై చేయొచ్చు.