Site icon HashtagU Telugu

Mumbai Rains: నీట మునిగిన 960 ఏళ్ల నాటి శివాలయం

Mumbai Rains

Mumbai Rains

Mumbai Rains: మహారాష్ట్రలో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. వర్షాల కారణంగా ముంబైలో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు తమ ఇళ్ల నుండి బయటకు రావద్దని అభ్యర్థించారు. అదే సమయంలో భారీ వర్షాల దృష్ట్యా నగరంలోని అన్ని పాఠశాలలు మరియు కళాశాలలను మూసివేశారు. ఆయా సంస్థలు కూడా వర్క్ ఫ్రమ్ అవకాశం కల్పించాయి. ఈ మేరకు ముంబై పోలీసులు సోషల్ మీడియా హ్యాండిల్‌లో ట్వీట్ చేశారు. భారీ వర్షాల కారణంగా ముంబై సహా పలు ప్రాంతాలు నీట మునిగాయి, కొన్ని చోట్ల ఇళ్లలోకి నీరు చేరింది. దీంతో ప్రభుత్వం అన్ని సహాయక చర్యలు చేపడుతుంది.

960 ఏళ్ల నాటి శివాలయం నీట మునిగింది:
నీటి ఎద్దడి కారణంగా ట్రాఫిక్‌, లోకల్‌ రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రానున్న కొద్ది రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా 960 ఏళ్ల నాటి శివాలయం కూడా వరదల్లో చిక్కుకుంది. భారీ వర్షాల కారణంగా అంబర్‌నాథ్ ఆలయం(Lord Shiv Temple) నీట మునిగింది. ఆలయం సమీపంలో వల్ధుని నది ప్రవహిస్తుంది మరియు నది ఉప్పెన కారణంగా దాని నీరు పరిసర ప్రాంతాలకు చేరుకుంది. ఆలయం పూర్తిగా నీటిలో మునిగిపోయింది.

వర్షం కారణంగా ముంబైలో రెడ్ అలర్ట్:
మధ్య మహారాష్ట్ర(Maharashtra)లో జూలై 27 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రెడ్ అలర్ట్ ప్రకటించారు. ముంబైతో పాటు రాయ్‌గఢ్, పాల్ఘర్‌లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. ఇది కాకుండా మహారాష్ట్రలోని తీర కొంకణ్ ప్రాంతంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేయబడింది. అరేబియా సముద్రంలో నీటి మట్టం కూడా నిరంతరం పెరుగుతోంది. వాతావరణ శాఖతో పాటు, ప్రభుత్వం కూడా అప్రమత్తం అయింది. ప్రజలు తమ ఇళ్లలోనే ఉండాలని విజ్ఞప్తి చేశారు. మహారాష్ట్రతో పాటు గుజరాత్, అస్సాం, ఉత్తరాఖండ్‌లో వర్షాలు బీభత్సం సృష్టించాయి.

Also Read: Ruturaj Gaikwad: కెప్టెన్ గా రుతురాజ్‌ గైక్వాడ్‌