Site icon HashtagU Telugu

Polling Updates : కళ్లు లేకున్నా ఓటు కోసం నడిచొచ్చాడు.. అక్కడ 23 ఏళ్ల తర్వాత పోలింగ్

Polling Updates

Polling Updates

Polling Updates : ఛత్తీస్‌గఢ్‌, మిజోరంలలో ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ జరుగుతోంది.  ఛత్తీస్‌గఢ్‌లో  ఉదయం 9:30 గంటల వరకు 10% ఓటింగ్ నమోదైంది. ఈ రాష్ట్రంలోని నక్సల్స్ ప్రభావిత కరిగుండం ప్రాంతంలో 23 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఓటింగ్ జరుగుతోంది.  కరిగుండం ప్రాంతంలో దంతెవాడ నియోజకవర్గంలో భాగంగా ఉంది. సీఆర్‌పీఎఫ్‌కు చెందిన 150 బెటాలియన్లు, జిల్లా బలగాల పహారాలో అక్కడ పోలింగ్ కొనసాగుతోంది. 2018లో దంతెవాడలో బీజేపీకి చెందిన భీమా మాండవి విజయం సాధించారు. 2019 లోక్‌సభ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు మాండవి, నలుగురు భద్రతా సిబ్బంది దంతెవాడ జిల్లాలో నక్సల్స్ దాడిలో మరణించారు. ఈసారి బీజేపీ తరఫున సల్వా జుడుం మాజీ సభ్యుడు చైత్రం అటానీ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి మాజీ సుల్వా జుడుం నాయకుడు దివంగత మహేంద్ర కర్మ కుమారుడు ఛవీంద్ర కర్మ పోటీ చేస్తున్నారు. దర్భా వ్యాలీలో నక్సల్స్ దాడిలో కర్మ మరణించాడు. మహీంద్రా కర్మ భార్య కూడా రెండు పర్యాయాలు ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా వ్యవహరించారు.

We’re now on WhatsApp. Click to Join.

  • ఛత్తీస్‌గఢ్‌‌లోని సుక్మా జిల్లాలో నక్సల్స్ అమర్చిన ఐఈడీ పేలింది. ఈ ఘటనలో సీఆర్పీఎఫ్ కమాండో గాయపడ్డారు.
  • మిజోరంలో ఉదయం 9 గంటల సమయానికి 17.18% పోలింగ్ నమోదైంది.
  •  మిజోరంలోని 96 ఏళ్ల దృష్టిలోపం ఉన్న ఓటరు పూ జ‌ద్వాలాకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశాన్ని అధికారులు కల్పించారు. అయితే ఆయన అందుకు నిరాకరించారు. మంగళవారం స్వయంగా రాజధాని ఐజ్వాల్‌లోని సార‌న్ వెంగ్ పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేసి వెళ్లారు.
  • మిజోరం రాష్ట్రానికి చెందిన 101 ఏళ్ల వృద్ధుడు పూ రాల్‌నుదులా, 86 ఏళ్ల  త‌న భార్య  పి తంగ‌లెతులైతో కలిసి  చంపాయి ద‌క్షిణ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో ఓటుహ‌క్కును(Polling Updates) వినియోగించుకున్నారు.

Also Read: Kamal Haasan Birthday : కమలహాసన్ జీవితంలోని ఆసక్తికర విశేషాలు