Navy Jobs – 910 : ఐటీఐ, డిప్లొమా, డిగ్రీతో నేవీలో 910 జాబ్స్

Navy Jobs - 910 :  ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసిన వారికి మంచి అవకాశం. భారత నౌకాదళం 910 ఉద్యోగాలను(Navy Jobs - 910) భర్తీ చేస్తోంది.

  • Written By:
  • Publish Date - December 20, 2023 / 02:32 PM IST

Navy Jobs – 910 :  ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసిన వారికి మంచి అవకాశం. భారత నౌకాదళం 910 ఉద్యోగాలను(Navy Jobs – 910) భర్తీ చేస్తోంది. ఇందుకోసం ఇండియన్‌ నేవీ సివిలియన్‌ ఎంట్రన్స్‌ టెస్టు (ఐఎన్‌సెట్‌)ను నిర్వహించనున్నారు. గ్రూప్‌-సీ కేటగిరిలో డ్రాఫ్ట్స్‌మెన్‌ మేట్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో అత్యధికంగా 565 పోస్టులు వెస్ట్రన్‌ నేవల్‌ కమాండ్‌‌లో, 36 పోస్టులు సదరన్‌ నేవల్‌ కమాండ్‌‌లో, 9 పోస్టులు ఈస్టర్న్‌ నేవల్‌ కమాండ్‌‌లో ఉన్నాయి. ఈ జాబ్స్‌కు అప్లై చేయాలంటే పదో తరగతిలో ఉత్తీర్ణతతోపాటు ఐటీఐ నిర్దేశిత ట్రేడుల్లో సర్టిఫికెట్‌ తప్పనిసరిగా ఉండాలి. నోటిఫికేషన్‌లో పేర్కొన్న 64 ఐటీఐ ట్రేడుల్లో ఏదైనా పూర్తి చేసుకున్నవారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.

We’re now on WhatsApp. Click to Join.

సీనియర్‌ డ్రాఫ్ట్స్‌మెన్‌ ఉద్యోగాలకు అప్లై చేసే వారికి వయసు 27 ఏళ్లకు మించకూడదు. ఛార్జ్‌మెన్, ట్రేడ్స్‌మెన్‌ మేట్‌ పోస్టులకు అభ్యర్థుల వయస్సు 18-25 ఏళ్లలోపు ఉండాలి. అయితే ఓబీసీలకు- 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీలకు- 5 ఏళ్లు, దివ్యాంగులకు- 10 ఏళ్ల వరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు అప్లికేషన్​ ఫీజు నుంచి మినహాయింపు ఉంది. మిగతా కేటగిరీల అభ్యర్థులు రూ.295ను దరఖాస్తు రుసుముగా చెల్లించాలి. ఇక గ్రూప్‌-బీ కేటగిరిలో సీనియర్‌ డ్రాఫ్ట్స్‌మెన్‌ పోస్టుల వివరాలలోకి వెళితే.. ఎలక్ట్రికల్‌- 142, మెకానికల్‌- 26, కన్‌స్ట్రక్షన్‌- 29, కార్టోగ్రాఫిక్‌- 11, ఆర్మమెంట్‌- 50 ఉన్నాయి. అభ్యర్థులకు పదో తరగతిలో ఉత్తీర్ణత తప్పనిసరి. రెండేళ్ల డిప్లొమా లేదా డ్రాఫ్ట్‌మెన్‌షిప్‌లో ఐటీఐ సర్టిఫికెట్‌ ఉండాలి.

Also Read: YS Sharmila Tweet : షర్మిల ఎమోషనల్ ట్వీట్.. కొడుకు, కుమార్తెకు అభినందనలు

దరఖాస్తు చేసుకున్న ఉద్యోగ విభాగం ప్రకారం ఎలక్ట్రికల్‌/ మెకానికల్‌/ నేవల్‌ ఆర్కిటెక్చర్‌/ కార్టోగ్రఫీలలో ఎందులోనైనా ఒకదానిలో మూడేళ్లు డ్రాయింగ్‌/ డిజైన్‌ అనుభవం ఉండాలి. ఛార్జ్‌మెన్‌ వర్క్‌షాప్‌ పోస్టులు మొత్తం 22 ఉండగా.. బీఎస్సీ మ్యాథ్స్‌/ఫిజిక్స్‌/కెమిస్ట్రీ చదివిన వారు లేదా కెమికల్‌ ఇంజినీరింగ్‌లో డిప్లొమా చేసిన వారు వీటికి అర్హులు.  ఛార్జ్‌మెన్‌ ఫ్యాక్టరీ పోస్టులు మొత్తం 20 ఉండగా.. బీఎస్సీ మ్యాథ్స్‌/ ఫిజిక్స్‌/ కెమిస్ట్రీ చదివినవారు లేదా ఎలక్ట్రికల్‌/ ఎలక్ట్రానిక్స్‌/ మెకానికల్‌/ కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌లో డిప్లొమా చేసినవారు వీటికి అర్హులు.  ఈ ఏడాది డిసెంబరు 31 వరకు అభ్యర్థులు ఆన్​లైన్​లో దరఖాస్తులు సమర్పించవచ్చు.  రాత పరీక్షను వంద మార్కులకు ఆబ్జెక్టివ్‌ పద్ధతిలో నిర్వహిస్తారు. ప్రశ్నాపత్రం ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఉంటుంది.రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఉద్యోగ విధుల్లోకి తీసుకుంటారు. పూర్తి వివరాల కోసం ​ https://www.joinindiannavy.gov.in/ను చూడవచ్చు.