Hajj Pilgrims : సౌదీ అరేబియాలో వడగాలులు దడ పుట్టిస్తున్నాయి. బుధవారం వరకు దాదాపు ఐదు రోజుల పాటు హజ్ యాత్ర జరిగిన మక్కా నగరంలో రోజూ సగటున 50 డిగ్రీల సెల్సీయస్ టెంపరేచర్స్ నమోదయ్యాయి. ఈ ఎండలు, వడగాలుల ధాటికి దాదాపు 650 మంది హజ్ యాత్రికులు మక్కా నగరంలో ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 68 మందే ఇండియన్స్ అని బుధవారం రాత్రి వార్తలు వచ్చినప్పటికీ.. తాజాగా గురువారం ఉదయం మరో కొత్త అప్‌డేట్ వచ్చింది. చనిపోయిన భారతీయ హజ్ యాత్రికుల సంఖ్య 90కిపైనే ఉంటుందని జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే ఈ వివరాలపై సౌదీ అరేబియా ప్రభుత్వం కానీ.. భారత ప్రభుత్వం కానీ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.
We’re now on WhatsApp. Click to Join
చనిపోయిన వారిలో దాదాపు 320 మంది ఈజిప్టు దేశీయులు, 60 మంది జోర్డాన్ దేశస్తులు ఉన్నారు. ట్యునీషియాకు చెందిన పలువురు హజ్ యాత్రికులు(Hajj Pilgrims) కూడా వడదెబ్బకు ప్రాణాలు కోల్పోయారు. ఈవివరాలను ఆయా దేశాల రాయబార కార్యాలయాలు ధ్రువీకరించాయి. అయితే ఇప్పటికీ భారత సర్కారు నుంచి దీనిపై ప్రకటన వెలువడకపోవడం గమనార్హం. ఈ ఏడాది మొత్తం 18.3 లక్షలమంది హజ్ యాత్రకు వెళ్లారు. వీరిలో 16 లక్షల మంది 22 దేశాలవారే. మిగతా 2 లక్షల మంది మాత్రమే సౌదీ అరేబియా స్థానిక హజ్ యాత్రికులు.
Also Read : Heart Attack : నిద్రలో గుండెపోటు రాకూడదంటే ఈ జాగ్రత్తలు మస్ట్
హజ్ అంటే ఏమిటి?
- ఇస్లాం ప్రకారం ప్రతి ముస్లిం నిర్వర్తించాల్సిన 5 బాధ్యతలు కల్మ, రోజా, నమాజ్, జకాత్, హజ్ యాత్ర.
- అందుకే ముస్లింలు హజ్ యాత్రకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు.
- ఆర్థికంగా, ఆరోగ్యపరంగా బాగా ఉన్న ముస్లింలు హజ్ యాత్ర చేయాలనేది ఇస్లాం మత విశ్వాసం.
- ఇస్లాం ప్రకారం.. ఇబ్రహీం ప్రవక్త, ఆయన కుమారుడు ఇస్మాయిల్ కాబా అనే రాయిని తయారు చేశారు.
- అయితే మక్కా ప్రజలు ఆ రాయిని ఆరాధించడం ప్రారంభించారు. అక్కడే మరిన్ని విగ్రహాలు పెట్టి ఆరాధించసాగారు.
- ఈక్రమంలో కాబా వద్ద తనను మాత్రమే ఆరాధించేలా చేయమంటూ మహ్మద్ ప్రవక్తను అల్లా ఆదేశించారు.
- క్రీ.శ.628లో 1,400 మంది అనుచరులతో కలిసి మహ్మద్ ప్రవక్త కాబాకు బయలుదేరారు. ఇస్లాం ప్రకారం ఇదే తొలి హజ్ యాత్ర.
- ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు హజ్ కోసం మక్కాకు చేరుకుంటారు. ఈ యాత్ర అయిదురోజుల పాటు జరుగుతుంది. బక్రీదు పండుగ రోజున ముగుస్తుంది.