Site icon HashtagU Telugu

Ex-Union Minister Manikrao Gavit : కేంద్ర మాజీ మంత్రి మాణిక్‌రావు గ‌విత్ క‌న్నుమూత‌.. 9 సార్లు ఎంపీగా..!

Ex Union Minister Manikrao Gavit Imresizer

Ex Union Minister Manikrao Gavit Imresizer

కాంగ్రెస్‌ సీనియర్‌ గిరిజన నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి మాణిక్‌రావ్‌ గవిత్ క‌న్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో శనివారం ఆస్పత్రిలో కన్నుమూసినట్లు కుటుంబ స‌భ్యులు తెలిపారు. గావిత్ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ హయాంలో హోంశాఖ‌, సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు మాణిక్‌రావు గ‌విత్‌కు కుమారుడు భ‌ర‌త్‌, కుమార్తె మాజీ ఎమ్మెల్యే నిర్మ‌ల ఉన్నారు. 1981 నుండి 2009 వరకు గిరిజనుల ప్రాబల్యం ఉన్న నందుర్బార్ జిల్లా నుండి గావిత్ రికార్డు స్థాయిలో తొమ్మిది సార్లు పార్ల‌మెంట్‌కుఎన్నికయ్యారు. కానీ 2014 ఎన్నికలలో ఓడిపోయారు.

2019లో అతని కుమారుడు భరత్, కాంగ్రెస్ నుండి టికెట్ నిరాకరించడంతో బిజెపిలో చేరారు. ఇగత్‌పురి (నాసిక్) నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన నిర్మల శివసేనలో చేరి ఓటమి పాలయ్యారు. మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ, సామాజిక, రాజకీయ రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న ప్రముఖ, దూరదృష్టి గల ‘ప్రజల ఆధారిత నాయకుడిని’ రాష్ట్రం కోల్పోయిందని అన్నారు. నందుర్‌బార్ జిల్లా నవాపూర్‌లోని ధూళిపాడ గ్రామంలో నిరాడంబరమైన గిరిజన కుటుంబంలో గ‌విత్ జ‌న్మించారు. 1965లో గ్రామపంచాయతీతో ప్రారంభించి, ఆ తర్వాత ధూలే జిల్లా పరిషత్‌కు ఎన్నికై 1980లో నవాపూర్ అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. 1981 నుండి 2009 వరకు, అతను నందుర్బార్ లోక్‌సభ నియోజకవర్గం నుండి రికార్డు స్థాయిలో వరుసగా 9 సార్లు ఎన్నికయ్యారు.

Exit mobile version