Petrol Price: పెట్రోల్ ధరలు తగ్గించిన మోదీ, కారణాలివే

అసోం, త్రిపుర, మణిపూర్, కర్ణాటక, గోవా రాష్ట్రాలు లీటర్ పెట్రోల్‌పై రూ. 7 తగ్గించాయి.

  • Written By:
  • Updated On - November 4, 2021 / 12:48 PM IST

అసోం, త్రిపుర, మణిపూర్, కర్ణాటక, గోవా రాష్ట్రాలు లీటర్ పెట్రోల్‌పై రూ. 7 తగ్గించాయి. మరోవైపు యూపీ ఏకంగా రూ. 12 తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. హిమాచల్ ప్రదేశ్ మాత్రం రూ. 2 తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రజలకు పెట్రోల్ మరింత చౌకగా అందుబాటులోకి రానుంది. కాగా ప్రస్తుతం బీజేపీ పాలిత రాష్ట్రాలు మాత్రమే పెట్రోల్ ధరలను తగ్గించాయి. మిగతా రాష్ట్రాల్లో కూడా వ్యాట్ ట్యాక్స్ తగ్గించాలని డిమాండ్లు వస్తున్నాయి. పెట్రోల్ రేట్లపై పన్ను తగ్గించే విషయంలో తెలుగు రాష్ట్రాలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి.ప్రతిరోజూ పెరుగుతూ వెళ్తున్న ఇంధన ధరలకు బ్రేక్ పడడమే కాకుండా పెట్రోల్, డీజిల్ ధరలు

పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది. దీంతో లీటర్ పెట్రోల్‌పై రూ.5, లీటర్ డీజిల్‌పై రూ.10 తగ్గాయి. రాష్ట్రాలు కూడా పెట్రో ఉత్పత్తులపై వ్యాట్ ట్యాక్స్ తగ్గించాలని కేంద్రం సూచించింది.

ఈ నేపథ్యంలో తొమ్మిది బీజేపీ పాలిత రాష్ట్రాలు పెట్రోల్‌పై విధించే పన్నును తగ్గించాయి. అసోం, త్రిపుర, మణిపూర్, కర్ణాటక, గోవా, ఉత్తరప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు వ్యాట్ టాక్స్ తగ్గించాయి. దాంతో ఆయా రాష్ట్రాల్లోని ప్రజలకు ఉపశమనం లభించిందని చెప్పొచ్చు.

అసోం, త్రిపుర, మణిపూర్, కర్ణాటక, గోవా రాష్ట్రాలు లీటర్ పెట్రోల్‌పై రూ. 7 తగ్గించాయి. మరోవైపు యూపీ ఏకంగా రూ. 12 తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. హిమాచల్ ప్రదేశ్ రూ. 2 తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రజలకు పెట్రోల్ మరింత చౌకగా అందుబాటులోకి రానుంది. కాగా ప్రస్తుతం బీజేపీ పాలిత రాష్ట్రాలు మాత్రమే పెట్రోల్ ధరలను తగ్గించాయి. మిగతా రాష్ట్రాల్లో కూడా వ్యాట్ ట్యాక్స్ తగ్గించాలని డిమాండ్లు వస్తున్నాయి. పెట్రోల్ రేట్లపై పన్ను తగ్గించే విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు ఏ నిర్ణయం తీసుకోలేదు.

పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై ప్రజలు సెటైర్స్ వేస్తున్నారు. తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో పలు రాష్ట్రాల్లో బీజేపీ అట్టర్ ప్లాప్ అయిందని, రానున్న కొన్ని రాష్ట్రాల ఎన్నికలపై ఈ ఎఫెక్టు ఉంటుందనే మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారని కొందరు అంటుంటే, వందల సార్లు పెంచి ఐదు రూపాయలు తగ్గిస్తే ఏం లాభం ఉండదని, ఇంధన ధరలపై నియంత్రణ లేకపోతే తగ్గించిన ఐదు రూపాయలు ఐదు రోజుల్లోనే పెంచుతారని వాహనదారులు అభిప్రాయపడుతున్నారు.