9 Died : మహారాష్ట్రలో ఘోర పేలుడు చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో తొమ్మిది మంది చనిపోయారు. నాగ్‌పూర్‌లోని బజార్‌గావ్ గ్రామంలో సోలార్ ఎక్స్‌ప్లోజివ్ కంపెనీలో ఉన్న కాస్ట్ బూస్టర్ ప్లాంట్‌లో ప్యాకింగ్ చేస్తున్న సమయంలో పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో 9 మంది కార్మికులు సజీవ దహనమయ్యారని నాగ్‌పూర్ రూరల్ ఎస్పీ వెల్లడించారు. పలువురికి గాయాలు కాగా సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మంటలను ఆర్పేందుకు పెద్ద సంఖ్యలో అగ్నిమాపక వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఈ విషయంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
We’re now on WhatsApp. Click to Join.
అంతకుముందు నవంబర్ 29న గుజరాత్‌లోని సూరత్‌లో ఉన్న రసాయన కర్మాగారంలో పేలుడు సంభవించి(9 Died) 24 మంది కార్మికులు గాయపడ్డారు. రసాయనాలు ఉన్న ఒక పెద్ద ట్యాంకులో లీకేజీ చోటుచేసుకుంది. దీంతో కెమికల్ లీకేజీ ఏర్పడి పేలుడు జరిగింది. అనంతరం కర్మాగారానికి సంబంధించిన మూడు అంతస్తుల భవనాన్ని మంటలు చుట్టుముట్టాయి. యూనిట్ మొత్తం దగ్ధమైంది. ఆ మంటలను ఆర్పేందుకు డజనుకు పైగా అగ్నిమాపక వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.