Site icon HashtagU Telugu

Business Ideas: 9 బెస్ట్ స్మాల్ బిజినెస్ ఐడియాస్.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం

Business Ideas

9 Best Small Business Ideas.. High Income With Low Investment

Business Ideas : మీరు తక్కువ డబ్బుతో వ్యాపారం చేయాలని అనుకుంటున్నారా ? మంచి బిజినెస్ ఐడియా ఎవరైనా చెబితే బాగుండు అని ఎదురు చూస్తున్నారా ? మేం మీలాంటి ఔత్సాహికుల కోసమే 9 బెస్ట్ స్మాల్ బిజినెస్ ఐడియాస్ (Business Ideas) ను పరిచయం చేస్తున్నాం. వాటిని తెలుసుకొని , అమలు చేసి .. మీరు ఉన్న చోటు నుంచే మంచి ఆదాయం సంపాదించుకొని జీవితంలో నిలదొక్కుకోండి . ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకు ఆఫీసుకు వెళ్లి జాబ్ చేసే వాళ్లకు కూడా ఈ ఐడియాస్ ఎక్స్ ట్రా ఆదాయం సంపాదించేందుకు హెల్ప్ చేస్తాయి. పూర్తి వివరాలు ఇవీ..

1. జిరాక్స్, ప్రింటింగ్ స్టోర్:

జిరాక్స్, ప్రింటింగ్ స్టోర్ పెట్టడానికి చాలా తక్కువ పెట్టుబడి సరిపోతుంది. స్కూల్ పిల్లలు, కార్యాలయ ఉద్యోగులు వివిధ రకాల ప్రాజెక్ట్‌లను కలిగి ఉంటారు. వారు జిరాక్స్, ప్రింటింగ్ స్టోర్ కు వెళ్లి వారి ప్రాజెక్ట్‌ రిపోర్ట్ ల ప్రింట్స్ తీసుకుంటారు. వారి అవసరాన్ని తీర్చడమే మీరు చేసే బిజినెస్. ఆఫీసులు , స్కూళ్ళు ఎక్కువగా ఉన్న ఏరియాలో జిరాక్స్, ప్రింటింగ్ స్టోర్ లొకేషన్ ఉండేలా ఏర్పాట్లు చేసుకోండి. ఈ బిజినెస్ లో మంచి ఆదాయం కూడా వస్తుంది. అలాగే మీరు జాబ్స్ కు అప్లై చేసే వారికి బయో-డేటా (రెస్యూమ్‌లు) తయారు చేసి ఇవ్వచ్చు. గవర్నమెంట్ జాబ్స్ అప్లై చేసే వర్క్స్ కూడా చేయొచ్చు. ఇందుకోసం మీకు కంప్యూటర్ ప్రింటర్, జిరాక్స్ మెషిన్ అవసరం.

2. ఫ్లవర్ షాప్:

ఫ్లవర్స్ వ్యాపారాన్ని చాలా తక్కువ మంది చేస్తుంటారు. ఈ వ్యాపారానికి మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉంది. కాబట్టి మీరు మీ దుకాణంలో అనేక రకాల మొక్కలు, పువ్వులను అమ్మొచ్చు. పెళ్లిళ్లు , పుట్టినరోజులు, ఏవైనా ఇతరత్రా సందర్భాల్లో పువ్వులు లేదా పుష్పగుచ్ఛాలను ప్రజలు కొంటారు. కాబట్టి పూల బిజినెస్ అనేది నిత్యం మంచి డిమాండ్ ను కలిగి ఉంటుంది. మీరు చాలా తక్కువ డబ్బుతో పూల దుకాణాన్ని తెరవవచ్చు. మీ షాపులో అనేక డిజైన్ల , అనేక సైజుల పుష్పగుచ్ఛాలను అమ్మవచ్చు. మీరు చాలా తక్కువ టైంలో ఈ బిజినెస్ లో సక్సెస్ కావచ్చు. ఈ బిజినెస్ కోసం మీరు చేయాల్సిందల్లా.. ఒక చిన్న దుకాణాన్ని ఎంచుకొని వివిధ రకాల పూలను కొనుగోలు చేయడం. వాటిని సక్రమంగా నిల్వ చేయడం. మీరు పూల గుత్తిని తయారు చేసి మీకు నచ్చిన ధరకు అమ్మవచ్చు.

3. మొబైల్ రిపేరింగ్ సెంటర్:

నేడు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ ఫోన్‌లు ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో , ఏదో ఒక దశలో రిపేర్ కు వస్తాయి. ఇలాంటి వారికి సర్వీస్ చేయడమే మీరు పెట్టే మొబైల్ రిపేరింగ్ షాప్ లక్ష్యం. ఇందులో చాలా మంచి సంపాదన వస్తుంది. ఈ బిజినెస్ కోసం మీకు ఎక్కువ పెట్టుబడి అవసరం లేదు. ముందుగా మీరు మొబైల్ రిపేర్ కోర్సు చేయాలి. ఆ కోర్సు పూర్తి కావడానికి 3 నుంచి 4 నెలల టైం పడుతుంది. ఈ కోర్సు చేయడానికి రూ. 3వేల నుంచి రూ. 5వేలదాకా ఖర్చు అవుతుంది. ఈ డబ్బులు కూడా లేవు అంటే.. మీరు యూట్యూబ్‌లో వీడియోలు చూసి మొబైల్ రిపేరింగ్ పనిని ఉచితంగా నేర్చుకోవచ్చు. ఆ తర్వాత మొబైల్ రిపేరింగ్ షాప్స్ ఎక్కువగా ఉండే ఏరియాలో లేదా ఏదైనా ప్రధాన బిజినెస్ సెంటర్ లో మీ షాపును పెట్టుకోండి. ఇందుకోసం మీకు పెద్ద దుకాణం అవసరం లేదని గుర్తుంచుకోండి. అయితే దుకాణంలో సెల్ ఫోన్ ను రిపేర్ చేసే కిట్ ను కొనుక్కోవాలి. ఇందుకోసం రూ.3వేలు సరిపోతాయి. కానీ ప్రతినెలా వేల రూపాయలు మీరు సంపాదించవచ్చు.

4. ఫాస్ట్ ఫుడ్ ట్రక్:

ఈ రోజుల్లో ప్రజలు బయట రుచికరమైన ఫాస్ట్ ఫుడ్ తినడానికి ఇష్టపడుతున్నారు. ఈ వ్యాపారం చాలా లాభదాయకంగా ఉంటుంది. తక్కువ డబ్బుతో ఈ బిజినెస్ ప్రారంభించవచ్చు. మీ దుకాణంలో మోమో చాప్, చవోమిన్, పావో భాజీ వంటి మరెన్నో ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ ను తయారు చేసి అమ్మొచ్చు. అయితే ఫుడ్ ఐటమ్స్ ను వండడానికి ఒక క్రాఫ్టర్ అవసరం. ఒక ఫుడ్ ట్రక్ ను ఏర్పాటు చేసుకొని మీరు ఒక చోటు నుంచి మరో చోటుకు వెళ్లి ఫాస్ట్ ఫుడ్ సేల్స్ చేసుకోవచ్చు. మీరు ఈ వ్యాపారాన్ని చిన్న ఫుడ్ ట్రక్కులో ప్రారంభిస్తే అనేక ప్రాంతాలకు వెళ్లి మీ ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ ను అమ్మొచ్చు.

5. ఐస్ క్రీమ్ పార్లర్:

ఐస్ క్రీమ్ సేల్స్ ఇప్పుడు భారీగా జరుగుతున్నాయి. ఈ బిజీ యుగంలో ప్రజలు కాసేపు కూర్చుని తమ మనస్సును మరియు శరీరాన్ని రిఫ్రెష్ చేసుకునేందుకు ఐస్‌క్రీమ్ పార్లర్‌ల ను బెస్ట్ ప్లేస్ గా భావిస్తారు. పాఠశాలలు, కాలేజీలు ఉండే ఏరియాల్లో చిన్నపాటి ఐస్‌క్రీం పార్లర్‌ తెరిస్తే బాగా గిట్టుబాటు అవుతుంది. రెస్టారెంట్ లాగా కొద్ది మంది వచ్చి కూర్చోవడానికి తగినంత స్థలం ఉంటే సరిపోతుంది. ఐస్ క్రీమ్స్ తో పాటు కూల్ డ్రింక్స్ కూడా మీ షాపులో అమ్మొచ్చు. ఆ తర్వాత ఇంకా బిజినెస్ ను పెంచాలని భావిస్తే స్నాక్స్, బేకరీ ఐటమ్స్ ను కూడా తెచ్చి సేల్ చేయొచ్చు. ముందుగా ఐస్ క్రీం నిల్వ చేయడానికి మీరు ఫ్రిజ్‌ కొనుక్కోవాలి. కస్టమర్స్ కూర్చోవడానికి బల్లలు, కుర్చీలు ఉంచాలి.

6. ట్యూషన్ సెంటర్:

మీకు టీచింగ్ స్కిల్స్, సబ్జెక్టు నాలెడ్జ్ ఉంటే దానిని మీ వృత్తిగా చేసుకోవచ్చు. ట్యూషన్ అంటే కేవలం విద్య మాత్రమే కాదు.. సంగీతం, డ్రాయింగ్, గిటార్ వాయించడం వంటివి కూడా ట్యూషన్ ద్వారా నేర్పవచ్చు. మీరు ఈ ట్యూషన్ వృత్తిని పెద్దగా చేయగలిగినప్పుడు దానిని కెరీర్‌గా తీసుకోవచ్చు. ఇందుకోసం ఒక గదిని తీసుకుని ట్యూషన్ సెంటర్‌గా చేసి క్లాసులు చెప్పడం స్టార్ట్ చేయండి. దీన్ని మంచి ఆదాయ వనరుగా మార్చుకోవచ్చు. ఇందులో పెద్దగా పెట్టుబడి అవసరం లేదు. రూమ్ అద్దె, నిర్వహణ చార్జీలు చాలు.

7. బ్లాగింగ్ ద్వారా ఆన్‌లైన్ వ్యాపారం:

మీరు ఇంట్లో నుంచే ఆన్‌లైన్ వ్యాపారం చేయాలని అనుకుంటే బ్లాగింగ్ చక్కటి ఆప్షన్. ఈరోజుల్లో మిలియన్ల కొద్ది మంది బ్లాగును సృష్టించడం ద్వారా ఇంటి నుండి పని చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. మీ బ్లాగ్‌ని ఇష్టపడే వ్యక్తులు పెరిగితే .. మీకు ఎంత ఆదాయం వస్తుందో ఊహించలేరు. ఇందుకోసం మీ స్వంత బ్లాగ్ కథనాలను రాయండి. మీకు నచ్చిన దాని గురించి మరియు వ్యక్తులు ఇష్టపడే దాని గురించి రాయొచ్చు. మీరు మీ బ్లాగ్‌లో మంచి కథనాలను రాస్తే గూగుల్, యాహు వంటి సెర్చ్ ఇంజిన్‌ల నుంచి విజిటర్స్ బ్లాగ్‌కి వస్తారు. ఈక్రమంలో మీరు గూగుల్ యాడ్ సెన్స్ ద్వారా మీ బ్లాగ్‌లో ప్రకటనలను ఉంచడం ద్వారా డబ్బు సంపాదించవచ్చు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఈ ఆన్‌లైన్ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు.

8. యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఆన్‌లైన్ వ్యాపారం:

మీరు ఆన్‌లైన్ వ్యాపారం చేయాలనుకుంటే మీరు యూట్యూబ్ ఛానెల్‌ని తయారు చేసి మంచి వ్యాపారంగా నడపవచ్చు. బ్లాగ్ లాగా మీరు యూట్యూబ్ ఛానెల్‌ లో వీడియోలను అప్‌లోడ్ చేయడం ద్వారా ఇంట్లో నుంచే డబ్బు సంపాదించవచ్చు. మీరు ఎటువంటి పెట్టుబడి లేకుండా ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. అయితే మీరు మీ స్వంత ప్రతిభను, మంచి వీడియోలను రూపొందించే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. ఈరోజుల్లో ఎంతోమంది యూట్యూబ్ ఛానెల్స్‌ని క్రియేట్ చేసి వీడియోలను అప్‌లోడ్ చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారు. అయితే ఈ వ్యాపారం నుంచి డబ్బు సంపాదించడానికి మీరు కొంత సమయం వెచ్చించాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి. మీరు కొంచెం సమయం వెచ్చించి మంచి వీడియోలు చేసి వాటిని మీ ఛానెల్‌లో అప్‌లోడ్ చేయగలిగితే బాగా సంపాదించడానికి అవకాశం ఉంటుంది.

9. ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్ బిల్డింగ్ బిజినెస్:

ఈ రోజుల్లో చాలామంది ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లను సందర్శించడానికి మరియు వస్తువులను కొనడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్ తక్కువ ఖర్చుతో మంచి వస్తువులను అందిస్తుంది. ప్రజలు సులభంగా ఈ వస్తువులను పొందవచ్చు. మీరు తక్కువ లాభంతో వ్యాపారం చేయాలనుకుంటే ఆన్‌లైన్ షాపింగ్ స్టోర్ లేదా షాపింగ్ వెబ్‌సైట్‌ను తయారు చేసుకోవచ్చు. షాపింగ్ వెబ్‌సైట్ తయారు చేయడానికి మీకు పెద్దగా ఖర్చు ఉండదు. వెబ్‌సైట్ డెవలపర్‌ సహకారంతో మీరు తక్కువ బడ్జెట్ లోనే ఆన్ లైన్ షాపింగ్ స్టోర్ స్టార్ట్ చేయొచ్చు. అలా కాకుండా వర్డ్ ప్రెస్ సాఫ్ట్ వేర్ తో ఉచిత షాపింగ్ వెబ్‌సైట్‌ను మీరే తయారు చేసుకోవచ్చు. వర్డ్ ప్రెస్ సాఫ్ట్ వేర్ తో ఉచిత షాపింగ్ వెబ్‌సైట్‌ తయారీ గురించి మీరు యూట్యూబ్ లోనూ తెలుసుకోవచ్చు. మీ స్వంత ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్‌ను సృష్టించే ముందు మీరు అందులో ఏం సేల్ చేయాలనీ భావిస్తున్నారు ? ఏ ధరల్లో సేల్ చేయాలనీ భావిస్తున్నారు అనేది డిసైడ్ కావాలి. ఆర్డర్స్ ను ఎలా డెలివరీ చేస్తారు అనే దానిపై కూడా క్లారిటీ ఉండాలి.

Also Read:  Ask KTR : మంత్రి కేటీఆర్ ఎక్క‌డ‌? మౌనిక మ‌ర‌ణ పాపం ఎవ‌రిది?