828 Jobs : 828 జాబ్స్.. ఎయిర్ ఇండియాలో గొప్ప ఛాన్స్

828 Jobs : ఎయిర్ ఇండియాలో ​ 828 జాబ్స్ భర్తీకి నోటిఫికేషన్ రిలీజైంది.

Published By: HashtagU Telugu Desk
Air India VRS

Air India VRS

828 Jobs : ఎయిర్ ఇండియాలో ​ 828 జాబ్స్ భర్తీకి నోటిఫికేషన్ రిలీజైంది. వీటిలో అత్యధికంగా 217 కస్టమర్ సర్వీస్​ ఎగ్జిక్యూటివ్ పోస్టులు, 178  సీనియర్​ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్​ పోస్టులు, 167 యుటిలిటీ ఏజెంట్​ కమ్​ ర్యాంప్​ డ్రైవర్​ పోస్టులు,  138 ర్యాంప్​ సర్వీస్​ ఎగ్జిక్యూటివ్  పోస్టులు ఉన్నాయి. మిగతా పోస్టుల్లో డిప్యూటీ మేనేజర్​ ర్యాంప్​/ మెయింటెనెన్స్​ (7) , డిప్యూటీ మేనేజర్ ర్యాంప్​( 28), జూనియర్ ఆఫీసర్​ టెక్నికల్ (24), డిప్యూటీ మేనేజర్​ – ప్యాసెంజర్ (19), డిప్యూటీ ఆఫీసర్ – ప్యాసెంజర్​ (30), డిప్యూటీ మేనేజర్ – కార్గో ( 3), డిప్యూటీ ఆఫీసర్ –  కార్గో ( 8), జూనియర్ ఆఫీసర్ – కార్గో( 9) ఉన్నాయి. ఈ పోస్టులకు ఎంపికయ్యే అభ్యర్థులు ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్​ ఇంటర్నేషనల్​ ఎయిర్​పోర్టులో ఒప్పంద ప్రాతిపదికన పనిచేయాల్సి ఉంటుంది.

We’re now on WhatsApp. Click to Join.

అభ్యర్థులు ఆయా పోస్టులను అనుసరించి.. పదో తరగతి సహా, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఎంబీఏలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కొన్ని పోస్టులకు కచ్చితంగా డ్రైవింగ్​ లైసెన్స్ కూడా కలిగి ఉండాలి. ప్రభుత్వ నిబంధనల మేరకు ఆయా కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి. అభ్యర్థులకు ట్రేడ్ టెస్ట్​, పర్సనల్ ఇంటర్వ్యూ లేదా వర్చువల్ ఇంటర్వ్యూ(828 Jobs) చేస్తారు. గ్రూప్ డిస్కషన్ సైతం ఉంటుంది. డిసెంబర్​ 18, 19, 20, 21, 22, 23 తేదీల్లో ముంబై అంధేరి-ఈస్ట్​‌లోని జీడీఎస్ కాంప్లెక్స్‌లో అర్హత పరీక్షలు జరుగుతాయి.

  Last Updated: 09 Dec 2023, 02:07 PM IST