Ukraine Russia War: ర‌ష్యాతో యుద్ధానికి ఉక్రెయిన్ ఆర్మీ లైన్‌లో నిల్చున్న వృద్ధుడు..!

  • Written By:
  • Publish Date - February 26, 2022 / 04:28 PM IST

ఉక్రెయిన్ పై దండయాత్ర మొదలెట్టిన రష్యా రోజురోజుకూ యుద్ధాన్ని తీవ్రతరం చేస్తోంది. ర‌ష్యా దాడుల కార‌ణంగా ఇప్ప‌టికే వంద‌ల‌మంది ఉక్రెయిన్ సైనికుల‌తో పాటు, అమాయ‌క పౌరులు కూడా మ‌ర‌ణించారు. వేల‌మంది గాయ‌ప‌డ్డారు. ఎంతో మంది ఉక్రెయిన్ ప్ర‌జ‌లు భ‌యంతో రోడ్ల మీద‌కు వ‌చ్చి, బిక్కు బిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పట్టుకుని జీవిస్తున్నారు. తమ వారికి అండగా నిలవాలనే తలంపుతో ఉపాధి కోసం సైన్యంలోకి చేరుతున్నారు.

ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే18 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న పురుషులు దేశం దాటి పోకూడదని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలన్‌స్కీ ఆదేశించడంతో ఎంతో మంది కుటుంబాలకు దూరంగా దేశంలోనే ఉండిపోయారు. దేశ అధ్యక్షుడు జెలన్‌ స్కీ కూడా సైనికుడిలా మారి తానే దగ్గరుండి సైన్యాన్ని నడిపించడం ప్రారంభించారు. ఇటీవలే ఓ తండ్రి, కూతుళ్ల వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్ అయింది. ఒకరిని విడిచి మరోకరు వదిలి వెళ్ల లేక కంట తడి పెట్టడం అందరినీ కదిలించించి.

ఇక దేశం కోసం పోరాడాలంటే యువకులే కాదు.. తాను కూడా సిద్ధమంటూ ముందుకొచ్చాడు ఉక్రెయిన్‌కు చెందిన ఓ 80 ఏళ్ల వృద్ధుడు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన తరుణంలో ఆ పోరాటంలో తాను కూడా పాల్గొంటానంటూ ఆ వయోధికుడు సైన్యంలో చేరేందుకు రావడం హృదయాన్ని పిండేస్తోంది. ఉక్రెయిన్ ఆర్మీలో తాను కూడా చేరతానంటూ ఆ వృద్ధుడు యువకులతో పాటు క్యూ లైన్‌లో నిల్చున్నాడు. ఈ ఫొటోను క్రత్రేయనా అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేశారు.

ఆర్మీలో చేరేందుకు వ‌చ్చిన వృద్ధుడు అతనితో పాటు ఓ బ్యాగ్ కూడా తీసుకొచ్చాడు. ఆ బ్యాగ్‌లో ఏమున్నాయో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఆ వృద్ధుడి బ్యాగ్‌లో 2 టీషర్ట్స్, ఓ జత ఫ్యాంట్లు, 2 టూత్ బ్రష్‌లు, లంచ్ కోసం కొన్ని శాండ్‌విచ్‌లు ఉన్నాయి. తన మనవల కోసం ఈ పనికొచ్చానని అతను చెప్పాడు. 80 ఏళ్ల వృద్ధుడు ఇలా సైన్యంలో చేరేందుకు రావడం నెటిజన్ల హృదయాన్ని కదిలిస్తోంది. దీంతో ప్రస్తుతం ఈ ఫొటో సోష‌ల్ మీడియ‌ల్లో ఓ రేంజ్‌లో చక్కర్లు కొడుతోంది.