Indian BSF Jawan : BSF జవాన్ ను దాచేసి తెలియదని చెపుతున్న పాక్

Indian BSF Jawan : పాకిస్థాన్ రేంజర్లు తమకు ఆ జవాన్ గురించి తెలియదని చెప్పడం భారత్‌లో ఆందోళన కలిగిస్తుంది. అసలు అకస్మాత్తుగా బార్డర్ దాటి పాక్ పరిధిలోకి వెళ్లిన జవాన్ గురించి సమాచారం లేకపోవడంపై భారత అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు

Published By: HashtagU Telugu Desk
Indian Bsf Jawan Purnam Kum

Indian Bsf Jawan Purnam Kum

భారత్‌-పాకిస్తాన్ సరిహద్దు (India-Pakistan border) దాటి పాకిస్థాన్ రేంజర్ల చేతిలో చిక్కిన భారత బీఎస్‌ఎఫ్ జవాన్ పూర్ణంకుమార్ షా (Indian BSF jawan Purnam Kumar Shah) విషయంలో ఉత్కంఠ నెలకొంది. గత 80 గంటలుగా భారత్ తరపున బీఎస్‌ఎఫ్ అధికారులు (BSF Officers) మూడు సార్లు చర్చలు జరిపినా ఇప్పటికీ పాక్ నుండి ఖచ్చితమైన సమాధానం అందలేదు. పాకిస్తాన్ అధికారులు పూర్ణంకుమార్ షా ఆచూకీపై ఏ సమాచారం లేదని బుకాయిస్తూ వస్తున్నారు. దీంతో అతడి విడుదల ఇంకా అనిశ్చితిలోనే ఉంది.

Pahalgam Terror Attack : కశ్మీర్ ఇండియాదే… అక్కడున్న కశ్మీరీలు మనోళ్లే – విజయ్ దేవరకొండ

పాకిస్థాన్ రేంజర్లు తమకు ఆ జవాన్ గురించి తెలియదని చెప్పడం భారత్‌లో ఆందోళన కలిగిస్తుంది. అసలు అకస్మాత్తుగా బార్డర్ దాటి పాక్ పరిధిలోకి వెళ్లిన జవాన్ గురించి సమాచారం లేకపోవడంపై భారత అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో మరోసారి చర్చలకు సిద్ధంగా ఉన్నామని బీఎస్‌ఎఫ్ ప్రకటించింది. ఇటీవల కశ్మీర్ పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో భారత్ మరియు పాక్ సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. సరిహద్దుల్లో గస్తీని పెంచడంతో పాటు అప్రమత్తతను దృష్టిలో ఉంచుకుని అదనపు బలగాలను మోహరించారు. జవాన్ల రక్షణకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని భారత అధికారులు స్పష్టం చేశారు.

  Last Updated: 27 Apr 2025, 10:39 AM IST