Rare Stars: ఆకాశంలో ఎనిమిది కొత్త నక్షత్రాలు

ఖగోళ శాస్త్రజ్ఞులు ఎనిమిది అరుదైన నక్షత్రాలను గుర్తించారు.

  • Written By:
  • Updated On - November 20, 2021 / 03:12 PM IST

పూణే:  ఖగోళ శాస్త్రజ్ఞులు ఎనిమిది అరుదైన నక్షత్రాలను గుర్తించారు. జాయింట్ మోట్రీవేవ్ రేడియో టెలిస్కోప్ ని ఉపయోగించి మెయిన్ సీక్వెన్స్ రేడియో పల్స్ అనే తరగతికి చెందిన ఈ అరుదైన నక్షత్రాలను కనుగొన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ రేడియో ఆస్ట్రో ఫిజిక్స్ సంస్థ తెలిపింది.

ఈ నక్షత్రాలు బలమైన అయస్కాంత క్షేత్రాలుగా ఉండడంతో పాటు సూర్యుడి కంటే వేడిగా ఉన్నట్లు శాస్త్రజ్ఞులు గుర్తించారట. ఇదే పద్దతిలో ఇలాంటి మూడు నక్షత్రాలను గతంలోనూ కనుగొన్నట్లు అధికారులు తెలిపారు. అయితే వీటిలో 8 నక్షత్రాలను 2021 లోనే గుర్తించారట.

వీటిని కనుకోవడానికి జరిగిన పరిశోధన ఖగోళ శాస్త్రజ్ఞుల ఇబ్బందులను అధిగమించడానికి దోహదపడే అంశాలతో పాటు వస్తువుల నేచర్ ని అక్యురేట్ గా అంచనా వేయడానికి ఉపయోగపడిందని సమాచారం. ఈ నూతన విషయాలతో కూడిన రీసెర్చ్ పేపర్ ని ది ఆస్ట్రోఫిజికల్ జర్నల్ ఆమోదించినట్లు టీమ్
సభ్యులు తెలిపారు.