Site icon HashtagU Telugu

Corona Cases: దేశంలో కొత్తగా 798 కరోనా కేసులు నమోదు

Corona Virus India

Corona Virus India

Corona Cases: ఇండియాలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 798 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4091కి చేరింది. కరోనా దాటికి 5 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కొత్త కేసులు యాక్టివ్ కేసుల సంఖ్య 4 వేలకు చేరుకున్నాయి. ఈ వైరస్ కారణంగా కేరళలో ఇద్దరు, మహారాష్ట్ర, పుదుచ్చేరి, తమిళనాడులో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందినట్టు ప్రకటించింది.

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కొత్త వేరియంట్ జేఎన్.1 మొదటి కేసు నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపారు. దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో పిల్లల నుంచి పెద్దల వరకు విధిగా మాస్కులు ధరించాలని డాక్టర్లు చెబుతున్నారు. కేసులు పెరుగుతున్నా మరణాల రేటు తక్కువగానే ఉంది. గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలో కూడా కరోనా కేసులు సంఖ్య పెరుగుతూ వస్తుంది. యాక్టివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతుంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 25 కొత్త కరోనా కేసులు నమోదైనట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. తెలంగాణ ప్రస్తుతం 64 యాక్టివ్ కరోనా కేసులున్నాయి.