రైతులు చేపట్టిన ఢిల్లీ చలో కార్యక్రమం (Delhi Chalo’ Protest)లో విషాదం చోటుచేసుకుంది. 79 ఏళ్ల జియాన్ సింగ్ (Gian Singh) శంభు సరిహద్దు (Shambhu Border) దగ్గర గుండెపోటుకు గురయ్యారు. దీంతో వెంటనే అప్రమత్తమైన సహచర రైతులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మరణించినట్లు డాక్టర్స్ తెలిపారు. ఈయన మరణంతో విషాదం నెలకొంది.
అన్ని పంటలకు కనీస మద్దతు ధర హామీ చట్టం, రుణమాఫీ, రైతులకు ఫించన్లు తదితర డిమాండ్ల అమలు కోసం సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా ‘చలో ఢిల్లీ’ నిరసనకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. సోమవారం అర్ధరాత్రి కేంద్రమంత్రులతో రైతు నేతల చర్చలు విఫలం కావడంతో మంగళవారం ఉదయం 10 గంటలకు.. 200 రైతు సంఘాల అధ్వర్యంలో పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్ నుంచి లక్ష మందికి పైగా రైతులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆరు నెలలకు సరిపడా ఆహారం, ఇతర నిత్యావసరాలను తీసుకుని వందలాది ట్రాక్టర్ ట్రాలీల్లో, ఇతర వాహనాల్లో బయల్దేరారు. కానీ ఎక్కడిక్కడే వారిని అడ్డుకునే ప్రయత్నం చేసారు. గత నాల్గు రోజులుగా వీరు ధర్నా చేస్తూ వస్తున్నారు. ఈరోజు ఏకంగా భారత్ బంద్ కు పిలుపునిచ్చారు.
We’re now on WhatsApp. Click to Join.
ప్రస్తుతం కేంద్ర వ్యవసాయ మంత్రి అర్జున్ ముండా, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ కేంద్ర ప్రభుత్వం తరఫున చర్చలకు హాజరయ్యారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సైతం సమావేశానికి విచ్చేశారు. సంయుక్త కిసాన్ మోర్చా (నాన్ పొలిటికల్) నేత జగ్జీత్ సింగ్ ధల్లేవాల్, కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ ప్రధాన కార్యదర్శి సర్వాన్ సింగ్ పంధేర్ రైతుల తరఫున కేంద్రంతో చర్చలు జరుపుతున్నారు.
Read Also : Devara Release Date : దేవర రిలీజ్ డేట్ వచ్చేసింది..ఇక పూనకాలే