Lawrence Bishnoi : గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్.. ఈ పేరు గురించి ఇప్పుడు నెటిజన్లు గూగుల్‌లో తెగ సెర్చ్ చేస్తున్నారు. మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్య వెనుక గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠా ఉందని పోలీసులు గుర్తించారు. దీంతో అతడి బ్యాక్ గ్రౌండ్‌ను తెలుసుకోవాలనే ఆసక్తి నెటిజన్లలో పెరిగింది. యూట్యూబ్‌లోనూ ఇతగాడిపై అప్‌లోడ్ చేస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. మంచి వ్యూస్‌ను సాధిస్తున్నాయి. ఇంతకీ ఎవరీ లారెన్స్ బిష్ణోయ్ ? ఇతడు గ్యాంగ్‌స్టర్(Lawrence Bishnoi) ఎలా అయ్యాడు ? ఈ కథనంలో చూద్దాం..
Also Read :TG IAS Officers : క్యాట్‌ను ఆశ్రయించిన ఆమ్రపాలి సహా ముగ్గురు ఐఏఎస్‌లు
- గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుత వయసు కేవలం 31 ఏళ్లే అని తెలుస్తోంది.
- పంజాబ్‌లోని ఫిరోజ్ పూర్ జిల్లా ధత్తరన్‌వాలీ గ్రామంలో 1993లో ఇతడు పుట్టాడు.
- లారెన్స్ బిష్ణోయ్ ఒక సంపన్న కుటుంబంలో పుట్టాడు.
- ఇతడు బిష్ణోయ్ వర్గానికి చెందిన వ్యక్తి.
- బిష్ణోయ్ వర్గం ప్రజలు రాజస్థాన్, హరియాణా, పంజాబ్ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంటారు.
- లారెన్స్ 12వ తరగతి వరకు చదువుకున్నాడు. పంజాబ్ యూనివర్సిటీ పరిధిలోని డీఏవీ కాలేజీలోనూ చదివాడు.
- లారెన్స్ బిష్ణోయ్ ఒక జాతీయ స్థాయి అథ్లెట్.
- ఇతడు పంజాబ్ యూనివర్సిటీ విద్యార్థి సంఘం నాయకుడిగానూ పని చేశాడు.
- లారెన్స్ లా కోర్సు కూడా చేశాడు.
- విద్యార్థి రాజకీయాల్లో లారెన్స్ ఉన్న టైంలోనే గోల్డీ బ్రార్‌తో పరిచయం ఏర్పడింది. గోల్డీ ప్రభావంతో విద్యార్థి రాజకీయాల ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు చేయడం ప్రారంభించాడు.
- డీఏవీ కాలేజీలో విద్యార్థుల మధ్య గ్యాంగ్‌వార్ జరిగింది. ఆ ఘటనలో లారెన్స్ ప్రియురాలిని ప్రత్యర్థి వర్గం సజీవ దహనం చేసింది. దీంతో అతడు నేరాల వైపు మళ్లాడని అంటారు.
- 2018లో లారెన్స్ తన అనుచరుడు సంపత్ నెహ్రాతో కలిసి సల్మాన్‌ఖాన్ హత్యకు కుట్రపన్నాడు.
- లారెన్స్ ముఠా నెట్‌వర్క్ పంజాబ్, హరియాణా, రాజస్థాన్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్‌లలో విస్తరించి ఉంది.
- పలు కేసుల్లో నేరస్తుడిగా తేలడంతో ప్రస్తుతం ఇతడు గుజరాత్‌లోని సబర్మతీ జైలులో శిక్షను అనుభవిస్తున్నాడు.
- సబర్మతి జైలులో ఉన్నా గ్యాంగ్‌ను అతడు నిరాటంకంగా నిర్వహిస్తున్నాడని అంటారు.
- లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్, మిత్రుడు గోల్డీ బ్రార్‌లు, మరో అనుచరుడు కలిసి కెనడా నుంచి గ్యాంగ్‌ను నడుపుతున్నారు. అక్కడి నుంచే మనదేశంలో యాక్టివిటీస్ ప్లాన్ చేస్తుంటారు.