Blast At Bharat Petroleum Oil Depot: భారత్ పెట్రోలియం ఆయిల్ డిపోలో పేలుడు.. ఏడుగురికి గాయాలు

మధ్యప్రదేశ్‌లోని భోపాల్ సమీపంలోని భారత్ పెట్రోలియం ఆయిల్ డిపోలో పేలుడు సంభవించింది.

  • Written By:
  • Updated On - October 22, 2022 / 09:24 PM IST

మధ్యప్రదేశ్‌లోని భోపాల్ సమీపంలోని భారత్ పెట్రోలియం ఆయిల్ డిపోలో పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 7 మందికి గాయాలు కాగా.. వారిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. భోపాల్ శివార్లలోని భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బిపిసిఎల్) డిపోలో పేలుడు సంభవించడంతో ఏడుగురు వ్యక్తులు గాయపడినట్లు పోలీసులు శనివారం తెలిపారు. గాయపడిన వారిలో ఆరుగురు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) డ్రైవర్లు లేదా సహాయకులుగా పోలీసులు భావిస్తున్నారు. గాయపడ్డ వారు ట్యాంకర్లలో ఇంధనం నింపడానికి అక్కడకు వచ్చారు అని ఖజూరి పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ సంధ్యా మిశ్రా తెలిపారు. క్షతగాత్రులలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బిపిసిఎల్) డిపోలోని బకానియా ప్రాంతంలోని ఆయిల్ డిపో వద్ద శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ట్యాంకర్ కంటైనర్‌లో పెట్రోల్ నింపుతుండగా పేలుడు సంభవించినట్లు సమాచారం. ఈ పేలుడు ఘటనలో మొత్తం ఏడుగురికి గాయాలు కాగా.. అందులో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అని ఖజూరి పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ సంధ్యా మిశ్రా తెలిపారు. పేలుడుకు ఖచ్చితమైన కారణం ఇంకా తెలియాల్సి ఉండగా.. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇది సంభవించి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.