Coal Oven – 5 Deaths : బొగ్గుల కుంపటికి ఐదుగురు టీనేజర్లు బలి.. ఏమైందంటే ?

Coal Oven - 5 Deaths : అసలే చలికాలం.. ఎముకలు కొరికే చలికి జనం వణికిపోతున్నారు..

  • Written By:
  • Publish Date - January 10, 2024 / 08:34 AM IST

Coal Oven – 5 Deaths : అసలే చలికాలం.. ఎముకలు కొరికే చలికి జనం వణికిపోతున్నారు.. దీంతో వెచ్చదనం కోసం, చలి కాచుకోవడానికి ఓ ఇంట్లో బొగ్గుల కుంపటిని పెట్టుకున్నారు. అనంతరం ఇంటి తలుపులు మూసుకొని కుటుంబంలోని ఏడుగురు సభ్యులు నిద్రపోయారు. సోమవారం రాత్రి నిద్రపోయిన వారు ఎంతకూ నిద్ర లేవలేదు. మంగళవారం సాయంత్రం వరకు కూడా ఇంటి తలుపులు తెరుచుకోలేదు. దీంతో ఇరుగుపొరుగు వెళ్లి తలుపులు బద్దలు కొట్టి చూడగా.. ఇంట్లో ఉన్న ఏడుగురిలో ఐదుగురు చనిపోయారు. మరో ఇద్దరి పరిస్థితి విషమించింది. దీంతో వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన  ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లా అల్లిపూర్ బుద్ గ్రామంలో చోటుచేసుకుంది.

We’re now on WhatsApp. Click to Join.

బొగ్గుల కుంపటి నుంచి వచ్చిన పొగను నిద్రలో నిరంతరాయంగా  పీల్చినందు వల్లే ఐదుగురు చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. బొగ్గుల కుంపటి నుంచి వెలువడే పొగలో కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ అత్యధిక మోతాదులో ఉంటాయి. ఇంటి తలుపులు మూసివేసి ఉండటంతో గదిలో ఈ రెండు వాయువులు నిండిపోయి.. ఆక్సిజన్ కొరత ఏర్పడి ఊపిరాడక ఐదుగురు ప్రాణాలు వదిలి ఉంటారని భావిస్తున్నారు. చనిపోయిన వారిని  సోనమ్ (19), వారిస్ (17), మెహక్ (16), జైద్ (15), మహిర్ (12)‌గా గుర్తించారు. ఈ ఘటన చోటుచేసుకున్న ఇల్లు రహీజుద్దీన్‌ అనే వ్యక్తికి చెందింది. బొగ్గు కుంపటి కారణంగా చనిపోయిన వారిలో ముగ్గురు అతడి పిల్లలు కాగా, మరో ఇద్దరు అతడి బంధువుల పిల్లలు. ప్రస్తుతం ఆరోగ్యం విషమంగా ఉన్న ఇద్దరిలో ఒకరు రహీజుద్దీన్‌ భార్య, మరొకరు రహీజుద్దీన్‌ సోదరుడు.

Also Read: Gunmen – Live : టీవీ స్టూడియోలో లైవ్.. తుపాకులతో దుండగుల ఎంట్రీ.. ఏమైందంటే ?

కట్టెల పొయ్యిలూ కొత్త రూపంలో..

వెనకటి రోజుల్లో పల్లెల్లో మొక్కజొన్న కంకులూ తేగలూ తినాలంటే కుంపట్లో కాసిని బొగ్గులు వేసి రాజుకున్నాక దానిమీద పెట్టుకుని కాల్చుకునేవారు. ఇక, గడ్డపెరుగుకోసం గిన్నెలో పాలుపోసి బొగ్గుల కుంపటిమీద పెట్టి, మీగడ కట్టాక వాటిని తోడుపెట్టేవారు. సన్నసెగమీద కాగిన ఆ పాలమీగడ రుచి గ్యాస్‌ స్టవ్‌మీద ఎన్ని గంటలు కాచినా రాదు. అలాగే పిండి వంటలూనూ. అంతేనా… బార్బెక్యూ కిచెన్‌లోనూ ఎలక్ట్రిక్‌, గ్యాస్‌ వాటికన్నా బొగ్గులూ లేదా కట్టెలతో మండించే పొయ్యిల్నే వాడుతుంటారు. ఎక్కువ సెగ వల్ల అవి మెత్తగా ఉడకడం, కాలడంతోపాటు ఆ పొగ వల్ల రుచీ బాగుంటుంది. కారణమేదయినా ఆనాటి కట్టెల పొయ్యిలూ కుంపట్లూ కొత్త రూపంలో మళ్లీ ఇళ్లలో కనిపిస్తున్నాయి. ఎన్విరోపిట్‌, ఫ్యాట్‌క్యాట్‌… వంటి కంపెనీలు బొగ్గు, కట్టెలతో పనిచేసే వుడ్‌, కోల్‌కుకింగ్‌ స్టవ్‌లను తయారుచేస్తున్నాయి. కట్టెల పొయ్యిల్లో వాటిని పెట్టేందుకు వీలుగా స్టాండులూ ఉంటున్నాయి. దాంతో వాటి నుంచి వచ్చే మసి లేదా బూడిద ఇల్లంతా ఎగరదు.