Site icon HashtagU Telugu

Bus Collides With Truck: అయోధ్యలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం

Bus Collides With Truck

Resizeimagesize (1280 X 720)

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య (Ayodhya)లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించారు. యూపీలోని అయోధ్య నుంచి అంబేద్కర్ నగర్ వైపు వెళ్తున్న బస్సు, ట్రక్కును ఢీకొని (Bus Collides With Truck) బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. లక్నో-గోరఖ్‌పూర్ హైవేపై ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బస్సు, ట్రక్కు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఢీకొనడంతో ట్రక్కు అదుపుతప్పి బస్సుపై పడింది. అయోధ్య చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అజయ్ రాజా తెలిపిన వివరాల ప్రకారం.. రోడ్డు ప్రమాదంలో ఇప్పటి వరకు ఏడుగురు మరణించారు. 40 మందికి పైగా గాయపడ్డారు. సమాచారం ప్రకారం.. ప్రమాదం తర్వాత డజనుకు పైగా అంబులెన్స్‌లను సంఘటనా స్థలానికి పంపారు అధికారులు. క్షతగాత్రులను జిల్లా ఆస్పత్రికి, వైద్య కళాశాలకు తరలించారు.

Also Read: Road Accident: జగిత్యాలలో బస్సును ఢీకొట్టిన లారీ.. ఒకే కుటుంబానికి చెందిన 25 మందికి గాయాలు

సీఎం యోగి సంతాపం

ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి పట్ల యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం వ్యక్తం చేశారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించి, వారికి సరైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

బలరామాపూర్‌లోనూ ప్రమాదం

ఇటీవల ఏప్రిల్ 8న యూపీలోని బలరాంపూర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఇక్కడ కారు ప్రమాదం జరిగింది. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన 6 మంది మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబం డియోరియా జిల్లా వాసి. ప్రమాదానికి గురైన కుటుంబం స్విఫ్ట్ డిజైర్ కారులో బలరాంపూర్ నుంచి బస్తీ వైపు వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో కారు ముక్కలైపోయింది. కారులో ఉన్న 6 మంది అక్కడికక్కడే మృతి చెందారు. కారులో భార్యాభర్తలు కాకుండా ఓ యువకుడు, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ కుటుంబం డియోరియా జిల్లాలోని శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బంకుల్ గ్రామానికి చెందినది.