Fake Cancer Drugs : నకిలీ మందుల మాఫియా గుట్టు రట్టయింది. రూ.100 విలువ చేసే యాంటీ ఫంగల్ మెడిసిన్‌ను ఖాళీ వయల్స్‌లో నింపేసి.. అదే క్యాన్సర్ ఔషధమని చెప్పి రూ. లక్ష నుంచి రూ.3 లక్షల రేటుకు అమ్ముతున్న కేటుగాళ్ల బండారం బట్టబయలైంది. ఇప్పటివరకు ఈ ముఠా ఇదే విధంగా 7వేలకుపైగా ఫేక్ క్యాన్సర్ ఇంజెక్షన్లను అమ్మిందని దర్యాప్తులో వెల్లడైంది. ఇంతకీ ఈ ముఠా ఎక్కడ యాక్టివిటీ చేసిందో తెలుసా ? మన దేశ రాజధాని ఢిల్లీలో !! సాక్షాత్తూ దేశ రాజధానిలోనే ఈవిధంగా నకిలీ మందుల మాఫియా చెలరేగుతుంటే.. దేశంలోని ఇతర ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు.
We’re now on WhatsApp. Click to Join
ఢిల్లీలో నకిలీ క్యాన్సర్ మందులు తయారు చేసి, సరఫరా చేస్తున్న ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠాలో ప్రధాన సూత్రధారులుగా విపిల్ జైన్, నీరజ్ చౌహాన్ వ్యవహరించారు. అరెస్టయిన వారిలో ఇద్దరు ఢిల్లీలోని ఓ ప్రముఖ ఆస్పత్రి ఉద్యోగులు కావడం గమనార్హం. గత రెండేళ్లుగా ఈ ఔషధ రాకెట్‌ను నడుపుతున్నామని ఏడుగురు నిందితులు దర్యాప్తులో తెలిపారు. మనదేశంలో వేలాది మందికి కుచ్చుటోపీ పెట్టిన ఈ ముఠా.. విదేశాలకు కూడా తమ యాక్టివిటీని విస్తరించింది. చైనా, అమెరికాలోని పలువురు ప్రవాస భారతీయులకు కూడా ఈ ఫేక్ క్యాన్సర్ ఇంజెక్షన్లను సప్లై చేయడం గమనార్హం.
Also Read : Electoral Bonds : ఎలక్టోరల్ బాండ్ల లెక్కపై ఎస్‌బీఐ కీలక ప్రకటన
ఢిల్లీ, గురుగ్రామ్‌లో ఉన్న రెండు ఫ్లాట్లు కేంద్రంగా ఫేక్ క్యాన్సర్ ఇంజెక్షన్లను తయారు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆయా ఫ్లాట్లలో తనిఖీ చేసిన పోలీసులు ఒక హీట్ గన్, భారీ ఎత్తున ఖాళీ వయల్స్, 800కుపైగా ప్యాకేజీ బాక్సులు, ఇతర పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఆస్పత్రుల నుంచి ఖాళీ వయల్స్‌ను సేకరించి, వాటిలో నకిలీ క్యాన్సర్ మెడిసిన్‌ను(Fake Cancer Drugs) నింపి అమ్మేశారు.