Adani companies: క‌బంధ‌హ‌స్తాల్లో `భార‌త మార్కెట్‌`, రూపాయ‌కు 80పైస‌లు `ఆదానీ` జేబులోకి..

భార‌త్ స్టాక్ మార్కెట్ లాభాల్లో 79శాతం ఆదానీ గ్రూప్ కు చెందిన ఏడు లిస్టెడ్ కంపెనీల వాటాగా ఉంది.

  • Written By:
  • Updated On - September 3, 2022 / 05:20 PM IST

భార‌త్ స్టాక్ మార్కెట్ లాభాల్లో 79శాతం ఆదానీ గ్రూప్ కు చెందిన ఏడు లిస్టెడ్ కంపెనీల వాటాగా ఉంది. మిగిలిన కంపెనీల‌న్నీ క‌లుపుక‌ని 21శాతం మాత్ర‌మే లాభాల్లో వాటా క‌లిగి ఉన్నాయ‌ని భార‌త స్టాక్ వ‌ర్గాల అధికారిక డేటా చెబుతోంది. అంటే, ఆదానీ ఎలా భార‌తీయుల సంప‌ద‌ను పోగేసుకుంటున్నారో అర్థం అవుతోంది.

అదానీ గ్రూప్ షేర్ల ర్యాలీ భారత స్టాక్ మార్కెట్‌కు దోహదపడిందని కేంద్రం సంబ‌ర‌ప‌డుతుంద‌ట‌. ఈ సంవత్సరం ఇప్పటివరకు దేశం మొత్తం మార్కెట్ క్యాప్ లాభంలో 79% అదానీ గ్రూప్‌లోని ఏడు లిస్టెడ్ సంస్థల ద్వారా అందించబడింది. BSEలోని అన్ని లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ 2022లో రూ. 12.74 లక్షల కోట్లు పెరిగింది, అయితే, ఏడు లిస్టెడ్ అదానీ కంపెనీలు ఈ కాలంలో మార్కెట్ క్యాప్‌లో రూ. 10.05 లక్షల కోట్లు లాభపడ్డాయి. ఇలాంటి ప‌రిణామాన్ని అధ్య‌య‌నం చేస్తోన్న ఆర్థిక‌వేత్త‌లు భార‌త ప్ర‌భుత్వం ఆదానీకి ప్రాధాన్యం ఇస్తోన్న తీరును విమ‌ర్శించ‌కుండా ఉండ‌లేక‌పోతున్నారు.

అదానీ గ్రూప్ షేర్లలో భారీ ర్యాలీ కారణంగా వ్యవస్థాపకుడు గౌతమ్ అదానీ ప్రపంచంలోనే మూడవ అత్యంత సంపన్న వ్యక్తిగా అవతరించారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, $142.7 బిలియన్ల సంపదతో, మొదటి మూడు స్థానాల్లోకి ప్రవేశించిన మొదటి ఆసియా వ్యక్తి అదానీ. అదానీ గ్రూప్ కంపెనీల్లో గౌతమ్ అదానీ హోల్డింగ్స్ విలువ గత రెండేళ్లలో 112 బిలియన్ డాలర్లు పెరిగింది, ఇది ప్రపంచంలోని బిలియనీర్లలో అత్యధికం. అతని సంపద గత రెండేళ్లలో $30.7 బిలియన్ల నుండి $142కి 365% పెరిగింది.