680 Jobs : ప్రభుత్వ రంగ సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL)లో 680 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ చదివిన వారికి ఇది గుడ్ న్యూస్. మొత్తం 680 పోస్టుల్లో.. 179 గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టులు, 103 టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టులు, 398 ట్రేడ్ అప్రెంటీస్ జాబ్స్ ఉన్నాయి. వివిధ విభాగాల్లో .. అత్యధికంగా 149 మెకానికల్ ఇంజనీరింగ్ పోస్టులు, 34 సివిల్ ఇంజనీరింగ్ పోస్టులు, 17 ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ పోస్టులు, 178 ఫిట్టర్ పోస్టులు, 100 వెల్డర్ పోస్టులు, 36 ఎలక్ట్రీషియన్ పోస్టులు, 23 టర్నర్ పోస్టులు ఉన్నాయి.
We’re now on WhatsApp. Click to Join.
ఈ పోస్టులకు ఎంపికయ్యే అభ్యర్థులకు ఏడాది పాటు ట్రైనింగ్ ఇస్తారు. ఈక్రమంలో ప్రతినెలా రూ.7700 నుంచి రూ.9000 వరకు స్టైపెండ్ అందిస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో భెల్ అధికారిక వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబర్ 1. అభ్యర్థులు ఎలాంటి దరఖాస్తు రుసుమును చెల్లించాల్సిన అవసరం లేదు. అభ్యర్థులు ఆయా పోస్టులకు అనుగుణంగా.. ఐటీఐ, డిప్లొమా, డిగ్రీలో పాసై ఉండాలి. అభ్యర్థుల వయస్సు 2023 నవంబర్ 1 నాటికి 18 ఏళ్ల నుంచి 27 ఏళ్లలోపు ఉండాలి. అయితే ఆయా కేటగిరీల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు(680 Jobs) వర్తిస్తాయి.